Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వాజ్‌పేయికి రాష్ట్రపతి, మోదీ, చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు

సోమవారం, 25 డిశెంబరు 2017 (13:16 IST)

Widgets Magazine

భారతరత్న, బీజేపీ సీనియర్ నేత, మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి పుట్టిన రోజును పురస్కరించుకుని.. ఆయనకు రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతితో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వాజ్‌పేయి నివాసానికి వెళ్ళి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లడించారు. వీరితో పాటు కేంద్ర మంత్రులతోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు అందజేశారు. వాజ్‌పేయి పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. 
 
గౌరవనీయులైన అటల్ జీ జన్మదిన శుభాకాంక్షలంటూ కామెంట్ చేశారు. దార్శనికత, ముందుచూపుతో వ్యవహరించి దేశాభివృద్ధికి పాటుపడ్డారని, అంతర్జాతీయంగానూ భారత్ ఖ్యాతిని ఇనుమడింపజేశారని కొనియాడారు. అటల్ జీకి భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ట్విట్టర్లో ఆకాంక్షించారు. గౌరవనీయులు, అత్యంత ప్రజాదరణ పొందిన శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.
 
అలాగే ఏపీ సీఎం చంద్రబాబు కూడా అటల్ బిహారీ వాజ్‌పేయికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. వాజ్‌పేయి గొప్ప దార్శనికుడు అని కొనియాడారు. మంగళగిరి వద్ద ఎయిమ్స్‌కు ఆయన పేరును సూచించింది తానేనని బాబు పేర్కొన్నారు. వాజ్‌పేయి పాలనాదక్షుడని, పండితుడు, కవి అని ప్రశంసలు కితాబిచ్చారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆర్కేనగర్ ఉప ఎన్నిక ఫలితాలు.. చిన్నమ్మ హర్షం.. ప్రభుత్వం కూలిపోతుందా?

తమిళనాట ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక ఫలితాలు రాజకీయంగా వేడి పుట్టిస్తున్నాయి. దివంగత జయలలిత ...

news

భర్త నచ్చలేదు.. మూడు నెలల గర్భవతి.. ఉరేసుకుని ఆత్మహత్య

ప్రేమ వివాహాలు, అక్రమ సంబంధాలు నేరాలకు కారణమవుతున్నాయి. ప్రేమించిన వ్యక్తిని వివాహం ...

news

ఫిలిప్పీన్స్‌‌ను కుదిపేసిన టెంబిన్- బస్సు ప్రమాదంలో 20 మంది మృతి (Video)

ఫిలిప్పీన్స్‌ను టెంబిన్ అనే తుఫాను ముంచేసింది. పెను తుఫాను అయిన టెంబిన్‌ జల ప్రళయానికి ...

news

బంగారు కుర్చీలు, బంగారు కంచాలన్నీ గాలి వార్తలే: జనార్ధన్ రెడ్డి

మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన ...

Widgets Magazine