శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 7 జూన్ 2019 (16:33 IST)

ఒకేరోజు.. ఇద్దరమ్మాయిలతో ఆటో డ్రైవర్‌కు పెళ్లి.. అతనితో జీవితం..

ఆటో డ్రైవర్‌కు ఒకేసారి రెండు పెళ్లిళ్లు జరిగాయి. ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుప్పూరు జిల్లా తారాపురం సమీపంలో పుదుక్కోట్టైమేడు ప్రాంతానికి చెందిన ఆట్రో డ్రైవర్ ఒకడు రోజూ తన ఆటోలో ప్రయాణం చేసే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఈ నేపథ్యంలో మే నెల 29వ తేదీన ఆమె కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు. దీంతో తారాపురం వద్ద ఆటో డ్రైవర్‌తో ఆమె వుండటాన్ని పోలీసులు కనుగొన్నారు. అయితే అక్కడికి వెళ్లాక పోలీసులు షాక్ అయ్యారు. అదే ఆటో డ్రైవర్‌తో మరో యువతి కూడా వుండటాన్ని గమనించారు. ఇందులో షాకయ్యే విషయం ఏమిటంటే..? ఆ ఆటోడ్రైవర్ ఇద్దరమ్మాయిలను ఒకేసారి పెళ్లి చేసుకోవడమే.
 
అంతేగాకుండా ఆటో డ్రైవర్‌తోనే జీవితం సాగిస్తామని.. అతనికి భార్యలుగా వుండిపోతామని ఆ ఇద్దరు మహిళలు చెప్పడం చూసి పోలీసులు షాకయ్యారు. కౌన్సిలింగ్ ఇచ్చినా లాభం లేకపోవడంతో ఆటో డ్రైవర్‌తోనే ఆ ఇద్దరు మహిళలలను పోలీసులు పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.