Widgets Magazine

తాజ్‌మహల్‌ను కూల్చేందుకు రెడీ.. యోగీజీ కదలండి పోదాం: ఆజంఖాన్

సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌తో కలిసి పర్యాటక క్షేత్రం తాజ్‌మహల్‌ను కూల్చేందుకు తాను సిద్ధమని ఆజంఖాన్ తెలిపారు. ఒకప్పుడు తాజ్ మహల్‌ శివాలయమని

selvi| Last Updated: శుక్రవారం, 29 జూన్ 2018 (11:35 IST)
సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌తో కలిసి పర్యాటక క్షేత్రం తాజ్‌మహల్‌ను కూల్చేందుకు తాను సిద్ధమని ఆజంఖాన్ తెలిపారు. ఒకప్పుడు తాజ్ మహల్‌ శివాలయమని ఆదిత్యనాథ్ ముందునుంచే చెప్తున్న నేపథ్యంలో..తాజ్‌ను కూలగొట్టేందుకు బీజేపీ కదిలితే.. తానూ కలిసొస్తానని అన్నారు. 
 
నిజానికి తాజ్ మహల్ శివాలయం అని యోగితో పాటు పలువురు తనతో చెప్పారు. అందువల్ల శివాలయాన్ని మళ్లీ శివాలయంగా మార్చేందుకు తనతో పాటు మరో 20వేల మంది పలుగు, పారలతో యోగి వెంట నడుస్తామని తెలిపారు.
 
తాజ్‌మహల్‌పై యోగి తొలి దెబ్బ వేస్తే.. రెండో దెబ్బ తానే వేస్తానని ఆజంఖాన్ వెల్లడించారు. తాజ్ మహల్ బానిసత్వానికి సూచికని ఆజంఖాన్ చెప్పారు. ఈ ఏడాది హిందూ మహాసభ అలీగఢ్ యూనిట్ విడుదల చేసిన క్యాలెండర్‌లో తాజ్‌మహల్‌ను తేజో మహాలయ్ శివ మందిర్‌గా ఆజంఖాన్ పేర్కొన్న సంగతి తెలిసిందే.


దీనిపై మరింత చదవండి :