Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అద్వానీపై అభియోగాలు నమోదు చేస్తే.. రాష్ట్రపతి రేస్ నుంచి తప్పుకుంటారా?

బుధవారం, 22 మార్చి 2017 (17:32 IST)

Widgets Magazine

బాబ్రీ మసీదు కూల్చివేత కేసు భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఈ మసీదు కూల్చివేత కేసులో అద్వానీతో సహా పలువురు బీజేపీ అగ్రనేతలను కుట్రదారులుగా చేర్చాలా? వద్దా అన్న అంశంపై సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలివ్వనుంది. 
 
నిజానికి అత్యున్నత న్యాయస్థానం బుధవారమే తీర్పు చెప్పాల్సి ఉండగా గురువారానికి వాయిదా వేసింది. గతంలో అద్వానీతో సహ 13 మందిపై కింది కోర్టు అభియోగాలను కొట్టివేయడాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. సాంకేతిక కారణాలు చూపుతూ అభియోగాలను కొట్టివేయడం సరికాదని న్యాయస్థానం అభిప్రాయపడిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కనుక గురువారం అద్వానీతో పాటు బీజేపీ నేతలు మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి, వినయ్ కతియార్, కళ్యాణ్ సింగ్‌లను నిందితులుగా పేర్కొన్నపక్షంలో వారిపై సీబీఐ అభియోగాలు నమోదు చేసే అవకాశం ఉంది. 
 
ఇదే జరిగితే భారత రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థి రేస్‌లో ఉన్న ఎల్కే.అద్వానీ పరిస్థితి ఏమిటన్నది ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అభియోగాలు నమోదు చేసినప్పటికీ.. ఆయన రాష్ట్రపతి అభ్యర్థి రేస్‌లో ఉంటారా? లేక తప్పుకుంటారా? అన్నది తేలాల్సివుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జయ చనిపోయినా వదలని కర్ణాటక సర్కార్.. రూ.100కోట్లు రావాల్సిందేనని?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా ఉన్న అమ్మ నెచ్చెలి వీకే. శశికళ ...

news

జంతు వధశాలల మూసివేతకు సీఎం యోగి ఆదేశం.. మహ్మద్ కైఫ్ అభినందనలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూపీలో గోవుల ...

news

చెన్నై : అశోక్ లేలాండ్ ఉద్యోగినికి కత్తిపోట్లు... మాజీ ఉద్యోగి ఘాతుకం

చెన్నైలో ఓ దారుణం జరిగింది. 31 యేళ్ళ అశోక్ లేలాండ్ మహిళా ఉద్యోగి కత్తిపోటుకు గురైంది. ఈ ...

news

వైకాపా క్యాడర్ హైరానా.. నంద్యాల ఉప ఎన్నికను ఎలా ఎదుర్కోవాలి?

యద్ధంలోనైనా.. రాజకీయంలోనైనా గెలుపే ప్రధానం. ఎలా గెలిచామన్నది కాదు.. గెలిచామా లేదా అన్నదే ...

Widgets Magazine