శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 31 జనవరి 2020 (08:29 IST)

ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 30న తెరుచుకోనున్న బద్రీనాథ్‌‌‌‌‌‌‌‌ టెంపుల్

చార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ధామ్‌‌‌‌‌‌‌‌ యాత్రలో ఒకటైన ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం బద్రీనాథ్‌‌‌‌‌‌‌‌ గుడి ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 30న తెరుచుకోనుంది. తెల్లవారుజామున 4:30 గంటలకు వేద మంత్రాల మధ్య ఆలయాన్ని తెరిచి ప్రత్యేక పూజలు చేసి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని బద్రీ–కేదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెంపుల్‌‌‌‌‌‌‌‌ కమిటీ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ మోహన్‌‌‌‌‌‌‌‌ ప్రసాద్‌‌‌‌‌‌‌‌ తాప్లియాల్‌‌‌‌‌‌‌‌ చెప్పారు.

శీతాకాలంలో మంచు కారణంగా ఆలయాన్ని దాదాపు ఆరు నెలల పాటు మూసేస్తారు. అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెలల్లో మంచు ఎక్కువగా కురవడంతో చార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ధామ్‌‌‌‌‌‌‌‌ యాత్రలో భాగమైన కేదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌‌‌‌‌, బద్రీనాథ్‌‌‌‌‌‌‌‌, యమునోత్రి, గంగోత్రి ఆలయాలను కూడా మూసేస్తారు.