Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తన ఊరివాడే అని ఆదరిస్తే.. అత్యాచారం చేసి బండరాయితో కొట్టి చంపాడు..

శుక్రవారం, 19 మే 2017 (12:59 IST)

Widgets Magazine
murder

దక్షిణ కర్నాటక రాష్ట్రంలో ఓ నేపాలీ మహిళ అత్యాచారం, హత్య కేసులో సరికొత్త కోణం వెలుగు చూసింది. తన ఊరివాడే అని దగ్గరకు చేరదీసిన మహిళపై ఓ ఎలక్ట్రీషియన్ అత్యాచారం చేసి.. తలపై బండరాయితో కొట్టి చంపాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
సౌత్ కర్నాటకలోని బనశంకరి, సర్జాపురలో నేపాల్‌కు చెందిన పవిత్ర (20) అనే మహిళ తన భర్తతో కలిసి నివశిస్తోంది. ఈమెకు నేపాల్‌కు చెందిన కరణ్‌ తిలక్ అనే యువకుడితో రెండేళ్లక్రితం పరిచయమైంది. ఇద్దరూ నేపాల్ దేశస్థులు కావడంతో పవిత్ర ఇంటికి కరణ్ వచ్చి వెళ్తూవుండేవాడు.
 
ఈ క్రమంలో తాను ఇబ్బందుల్లో ఉన్నానంటూ అతడు ఆమె నుంచి పలుమార్లు డబ్బు అప్పుగా తీసుకున్నాడు. ఆమె తిరిగి అడిగినా అతడు చెల్లించలేదు. దీంతో అతన్ని అందరి ముందు నిలదీసింది. దీన్ని అవమానంగా భావించిన కరణ్... డబ్బులిస్తానని ఆమెను రహస్యప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి బండరాయితో తలపై మోది హత్యచేశాడు. 
 
ఆమె కనిపించకపోవడంతో సెక్యూరిటీ గార్డుగా పని చేసే భర్త కరణ్‌ సర్జాపుర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు అనుమానంతో తిలక్‌‌ను మంగళవారం అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారణ చేపట్టడంతో హత్యవిషయం వెలుగులోకి వచ్చింది. ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్యచేసినట్లు తిలక్‌ అంగీకరించాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Murder Woman Nepal Bangalore Woman's Murder

Loading comments ...

తెలుగు వార్తలు

news

బీజేపీ మంత్రులను పక్కనబెట్టిన చంద్రబాబు... టీడీపీ - బీజేపీ మైత్రి చెడినట్టేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టీడీపీ సర్కారులో బీజేపీకి ...

news

ఏం మాట్లాడినా మీడియా నన్ను తరుముతోంది.. తమిళనాడు నుంచే వెళ్లిపోమంటున్నారు.. నెవర్ అంటున్న తలైవా

దాదాపు 23 ఏళ్లు కర్నాటకలోనే జీవించాను. 43 సంవత్సరాలుగా తమిళనాడులో ఉంటున్నాను అయినా నన్ను ...

news

అమెరికా శాంతిని ఆకాంక్షిస్తోంది.. అవసరమైతే చర్చలకు సిద్ధం.. ట్రంప్ స్వరం మారింది..

ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జాంగ్‌ను ఎలా దారికి తెచ్చుకోవాలో తమకు బాగా తెలుసునని అమెరికా ...

news

యుద్ధ మేఘాలు : ఉత్తర కొరియాపై దాడికి కదిలిన యుఎస్ వార్ షిప్?

అమెరికా, ఉత్తరకొరియా దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలముకుంటున్నాయి. ఉత్తర కొరియా ధిక్కార ...

Widgets Magazine