శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 జూన్ 2023 (10:21 IST)

శిశువు పాలు తాగట్లేదని.. చేతి వేళ్లను వేడి నూనెలో ముంచింది..

ఉత్తరప్రదేశ్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. మూఢనమ్మకానికి గురైన ఓ మహిళ కన్నబిడ్డను పొట్టనబెట్టుకుంది. అయిదు రోజుల వయసున్న శిశువు పాలు తాగడం లేదని ఆందోళన చెందిన ఓ మహిళ.. చిన్నారితో పాలు తాగించేందుకు శిశువు చేతి వేళ్లను వేడి నూనెలో ముంచింది. 
 
ఈ ఘటనపై నర్సు ఫిర్యాదు మేరకు పోలీసులు రంగం లోకి దిగారు. దర్యాప్తు జరుపుతున్నారు. చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. బారాబంకీ జిల్లా ఇస్రౌలీ గ్రామానికి చెందిన ఇర్ఫాన్, ఆసియా దంపతులకు ఈ నెల 11న పండంటి బాబు పుట్టాడు. ఈ బాబు నాలుగు రోజుల నుంచి పాలు తాగట్లేదు. 
 
దీంతో ఆవేదను గురైన మహిళ సమస్యను పరిష్కరించేందుకు చిన్నారి వేళ్లను వేడి నూనెలో ముంచాలని ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది ఒకరు దారుణ సలహా ఇచ్చారు. అప్పటికే ఆసియా ఓ బిడ్డను కోల్పోయింది. ఆ భయంతో ఇలా చేశానని ఆ తల్లి దర్యాప్తులో వెల్లడించింది.