speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)
బెంగళూరు: హిందీలో మాట్లాడనందుకు కన్నడిగ ఆటో డ్రైవర్‌ను హిందీ మాట్లాడే వ్యక్తి బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన బెంగళూరులోని ఎస్ఎంఎస్ ఆర్కేడ్ రోడ్డులో జరిగింది. ఒక ఆటో డ్రైవర్‌ను బెదిరిస్తున్నాడు హిందీ మాట్లాడుతున్న వ్యక్తి. దీన్ని ఒక వ్యక్తి వీడియో తీస్తుండగా, మరో మహిళ హిందీ మాట్లాడే యువకుడిని పట్టుకుని పక్కకు తీసుకెళ్లింది.
ఆటో దిగిన యువకుడు హిందీలో మాట్లాడాలని అన్నాడు. ముందు నువ్వు కన్నడ మాట్లాడటం నేర్చుకో.. నువ్వు బెంగళూరు వచ్చావు కదా? అంటూ ఆటో డ్రైవర్ బదులిచ్చాడు.
ఈ సమయంలో, ఆ యువకుడితో ఉన్న స్త్రీ అతడిని వారిస్తూ తనతో తీసుకుని వెళ్లింది. ఆ యువకుడు పోతూపోతూ, "నువ్వు బెంగళూరులో నివసించాలనుకుంటే, హిందీ మాట్లాడటం నేర్చుకో" అని అన్నాడు. ఆటో డ్రైవర్ ఎదురుదాడి చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.