Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

లెక్కలు చదువుకోమన్నారని తల్లిదండ్రుల్ని చంపేశాడు.. ప్రియురాల్ని పాతేశాడు.. ఆపై 200 ఎఫ్‌బీ ఖాతాలు ఓపెన్ చేసి..?

శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (14:34 IST)

Widgets Magazine

మహిళలపై ప్రేమోన్మాదులు, కామాంధుల దుశ్చర్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇటీవల ప్రియురాలిని చంపి ఇంట్లోనే పాతిపెట్టిన కేసులో భోపాల్‌కు చెందిన ఉదయన్ దాస్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ నిందితుడు గతంలో తన తల్లిదండ్రులను హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.

గణితం బాగా చదువుకోమని అప్పుడప్పుడు కోప్పడేవారని.. అది తనకు నచ్చక వారిని హతమార్చినట్లు పోలీసుల ఎదుట ఉదయన్ దాస్ అంగీకరించాడు. తల్లిదండ్రులను మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ హిట్లర్‌ అని అభివర్ణించాడు. తనకిష్టంలేని పనులు చేయించినందుకే వారిని చంపేశానని, అందుకు తనకేమాత్రం బాధ, పశ్చాత్తాపం లేవని చెప్పాడు.
 
రాయ్‌పూర్‌ పోలీసులు ఉదయన్‌ని విచారించిన నేపథ్యంలో ఈ విషయాలన్నీ వెల్లడయ్యాయి. తల్లిదండ్రులను హతమార్చి, నకిలీ మరణధృవీకరణ పత్రాలతో వారి పేరిట ఉన్న ఆస్తులను అమ్మి డబ్బు జమ చేసుకున్న ఉదయన్‌ ఆ డబ్బుతో విలాస జీవితం ప్రారంభించాడు.

దాదాపు 200 ఫేస్‌బుక్‌ ఖాతాలు తెరచి వాటి ద్వారా అమ్మాయిలతో పరిచయం పెంచుకున్నాడు. ఎన్నారైనని.. ఒబామా, ట్రంప్ వంటి వారితో సంబంధాలున్నాయని.. మార్ఫింగ్ చేసిన ఫోటోలతో ఏమార్చేవాడని పోలీసులు చెప్పారు. ఉదయన్‌ నోటివెంట ఇదంతా విన్న పోలీసులు అతడిని సైకోగా భావిస్తున్నారు. కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు తెలిపారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శశికళకు తేరుకోలేని షాక్... ఆ తీర్మానం చెల్లదు... ఈసీకి ప్రిసీడియం ఛైర్మన్ లేఖ...

తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం కోసం ఎత్తులు పైఎత్తులు వేస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ...

news

మహిళలను గౌరవించడమే శ్రేయస్కరం: బౌద్ధ గురువు దలైలామా

మహిళలను గౌరవించడమే అన్నివిధాలా శ్రేయస్కరమని బౌద్ధమత గురువు దలైలామా అన్నారు. ఏపీ రాజధాని ...

news

ట్రంప్‌కు బ్రిటీష్ పార్లమెంట్‌లో అవమానం.. రేసిజం-సెక్సిజం‌కు వ్యతిరేకం.. మాట్లాడేందుకు వీల్లేదు..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బ్రిటీష్ పార్లమెంట్‌లో అవమానం జరిగింది. ఆ దేశ ...

news

పన్నీర్ సెల్వం రాజీనామా పత్రాన్ని వెనక్కి తీసుకోలేరుగానీ... అలా చేయొచ్చు

తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి ఓ.పన్నీర్ సెల్వం రాజీనామా చేశారు. ఆ తర్వాత దానిపై రాష్ట్ర ...

Widgets Magazine