మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 8 జులై 2019 (15:09 IST)

మోకాళ్ళపై కూర్చోబెట్టి గుంజిళ్లు తీయించారు.. ఎందుకు?

మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో గోసంరక్షకులు చేష్టలు శృతిమించిపోతున్నాయి. జంతు ప్రదర్శనకు గోవులను తరలిస్తున్నారన్న ఆరోపణలపై 24 మందిని అదుపులోకి తీసుకున్న గోసంరక్షకులు... వారిని మోకాళ్ళపై కూర్చోబెట్టి గుంజిళ్లు తీయించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లా నుంచి మహారాష్ట్రలో జరుగుతున్న ఓ జంతు ప్రదర్శనకు కొంతమంది గోవులను తరలిస్తున్నారు. ఈ విషయం కొంతమంద గోసంరక్షకుల దృష్టికెళ్లింది. అయితే, ఈ గోవులను గోవధకు తరలిస్తున్నారని గోసంరక్షకులు భావించి, వారందరినీ అడ్డుకున్నారు. 
 
ఆ తర్వాత చేతులను తాళ్ళతో కట్టేసి మోకాళ్లపై కూర్చోబెట్టి గుంజిళ్లు తీయించారు. వారితో బలవంతంగా గోమాతాకీ జై అంటూ నినాదాలు చేయించారు. ఆ తర్వాత వారిని తన్నుకుంటూ ఊరేగించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. గోవులను తరలిస్తున్న వారితో పాటు వారిని హింసించిన గోసంరక్షకులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో 16 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.