Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మోడీని ఏమైనా అంటే నరకడానికి వెనుకాడం : బీజేపీ ఎంపీ

బుధవారం, 22 నవంబరు 2017 (15:53 IST)

Widgets Magazine
nithyananda roy

భారతీయ జనతా పార్టీ ఎంపీ, బీహార్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నిత్యానంద్ రాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని వేలెత్తి చూపినా, చెయ్యెత్తి చూపినా వాటిని నరికేస్తామని హెచ్చ‌రించారు. న‌రేంద్ర‌ మోడీ పేదరికాన్ని జయించి ప్రధానమంత్రి అయ్యారని అన్నారు.
 
మోడీని ఏమైనా అంటే నరక‌డానికి కూడా వెనుకాడబోమని హెచ్చ‌రించారు. మోదీ రూపంలో స్వామి వివేకానంద మళ్లీ పుట్టారని వ్యాఖ్యానించారు. నిత్యానంద చేసిన వ్యాఖ్య‌ల‌పై ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు విమ‌ర్శ‌ల దాడి మొద‌లుపెట్టారు.
 
మరోవైపు బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి కూడా మోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. మంగళవారం జరిగిన ఆర్జేడీ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ, బీహార్‌లో చాలామంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గొంతు కోసేందుకు, ఆయన చేతులు నరికేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. 
 
నరేంద్ర మోడీపై ఆరోపణలు చేసేవారి వేళ్ళు నరుకుతామని వాళ్ళు అంటున్నారని, అలా చేస్తే, ఊరికే కూర్చునేందుకు దేశంలో ఎవరూ సిద్ధంగా లేరన్నారు. బీహార్ జనం ఏమీ అనరా? మోడీ తల నరికేందుకు, ఆయన చేతిని ముక్కలు చేసేందుకు ఇక్కడ చాలా మంది ఉన్నారన్నారు. ఇందుకోసం తాము జైలుకు వెళ్లేందుకు కూడా వెనుకాడబోమన్నారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు రాజకీయ వర్గాల్లో వివాదాస్పదమయ్యాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పద్మావతి రచ్చ... ప్రధానమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రబ్రీదేవి

బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి, మాజీ ...

news

కాంగ్రెస్ హామీ ఇచ్చింది.. వారికే పటీదార్ల మద్దతు : హార్దిక్ పటేల్

బీసీ జాబితాలో పటేదార్లను చేర్చడానికి కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హామీ ఇచ్చిందనీ అందువల్ల ...

news

నిత్యానంద-రంజిత వీడియో క్లిప్పింగ్స్ ఒరిజినలే...ఫోరెన్సిక్స్ రిపోర్ట్

2010లో నిత్యానంద-రంజితలు కలిసి పడకగదిలో ఉన్న వీడియో క్లిప్పింగ్స్‌ను ప్రముఖ తమిళ టీవీ ...

news

అమ్మను అపస్మారక స్థితిలోనే ఆస్పత్రిలో చేర్చారట.. పెన్ డ్రైవ్‌లో?

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివసించిన వేద నిలయంలో ఐటీ అధికారులు సోదాలు చేసిన సంగతి ...

Widgets Magazine