మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 19 డిశెంబరు 2022 (13:14 IST)

ప్రారంభానికి ముందే కుప్పకూలిన కొత్త వంతెన.. ఎక్కడ?

bihar bridge collapse
బీహార్ రాష్ట్రంలో ఓ నదిపై నిర్మించిన వంతెన ప్రారంభానికి ముందే కుప్పకూలిపోయింది. బెగుసరాయ్‌ జిల్లాలో బుద్ధి గండక్ నదిపై నిర్మించిన వంతెన ఆదివారం కూలిపోయింది. మొత్తం 206 మీటర్ల పొడవుగల ఈ వంతెన ఇంకా ప్రారంభానికి కూడా నోచుకోలేదు. దానికికంటే ముందుగానే ఈ వంతెన కూలిపోవడంతో ప్రతి ఒక్కరూ షాక్‌కు గురయ్యారు. ఈ వంతెనను అహోక్ గండక్ ఘాట్ నుంచి ఆక్రిత టోల చోకి, బిషన్ పూర్‌ల మధ్య నిర్మించారు. 
 
గత 2016లో ప్రారంభించి 2017లో పూర్తి చేశారు. మొత్తం 13 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. కానీ, వంతెనను అనుసంధానించే రోడ్డు లేకపోవడంతో ఈ వంతెన ప్రారంభానికి నోచుకోలేదు. అదేసమయంలో ఇటీవల ఈ వంతెనకు పగుళ్లు కనిపించాయి. వీటిని పరిశీలించిన అధికారులు.. ఈ బీటలకు మరమ్మతులు చేపట్టకముందే ఈ వంతెన కూలిపోయింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు.