ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 జనవరి 2023 (20:44 IST)

పిండాన్ని కుక్కకు ఆహారంగా పెట్టిన వైద్యుడు.. మహిళ మృతి

బీహార్‌లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణీ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కడుపులో వున్న పిండాన్ని కుక్కకు ఆహారంగా పెట్టాడు వైద్యుడు. ఈ ఘటన బీహార్‌లోని హాజీపూర్‌లో వెలుగు చూసింది. 
 
వివరాల్లోకి వెళితే.. బాలిగాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళా గర్భిణీ.. ఇటీవలే తీవ్రమైన కడుపునొప్పితో బాధపడింది. దీంతో స్థానికంగా ఉన్న డాక్టర్ సంప్రదించింది. అతను ఇచ్చిన మెడిసిన్స్ వాడిన తర్వాత బాధితురాలు తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో గర్భిణీకి డాక్టర్ అబార్షన్ చేశాడు. 
 
పిండాన్ని తీసి బకెట్‌లో వుంచాడు. ఇక బాధితురాలి పరిస్థితి విషమించడంతో పాట్నాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. 
 
అయితే పిండాన్ని తమకు ఇవ్వాలని, బాధితురాలి కుటుంబ సభ్యులు అడగగా వైద్యుడు నిరాకరించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే పిండాన్ని కుక్క‌కు ఆహారంగా పెట్టిన‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన విచార‌ణ‌లో తేల‌లేద‌ని పోలీసులు తెలిపారు.