శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 6 మే 2016 (15:37 IST)

నిర్లక్ష్యపు డ్రైవింగ్ కేసులో గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యేకు మూడు నెలల జైలుశిక్ష

నిర్లక్ష్యపు కారు డ్రైవింగ్ కేసులో గుజరాత్ రాష్ట్ర సిట్టింగ్ బీజేపీ ఎమ్మల్యేకు మూడు నెలల జైలుశిక్ష పడింది. ఈ మేరకు ఆ రాష్ట్రంలోని సబర్‌కాంత్‌ జిల్లాలోని హిమ్మత్‌నగర్‌ ఫస్ట్‌క్లాస్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ వీసీ త్రిపాఠి తీర్పునిచ్చారు. 
 
గత 2013 డిసెంబరు నెలలో సిట్టింగ్‌ భాజపా ఎమ్మెల్యే రాజేంద్ర సింహ్‌ చావడా నిర్లక్ష్యంగా కారు నడిపి... అజయ్‌ పటేల్‌ అనే వ్యక్తిని ఢీకొట్టించారు.  చావడా మద్యం సేవించి, అత్యంత వేగంతో చాలా నిర్లక్ష్యంగా కారు నడిపారని అజయ్‌ పటేల్‌ తన ఫిర్యాదలో పేర్కొన్నాడు. పైగా ఈ ప్రమాదంలో పటేల్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీంతో మోటార్‌ వాహనాల చట్టం కింద చావడాపై కేసు నమోదు చేశారు. 
 
దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. చావడాను దోషిగా నిర్ధారించి, మూడు నెలల జైలుశిక్షతో పాటు.. రూ.2600 అపరాధం విధించింది. అయితే, ఎమ్మెల్యే అదే కోర్టులో రూ.10 వేల పూచీకత్తుతో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో కోర్టు చావడాకు బెయిల్‌ మంజూరు చేసింది. కాగా, చావడా 2012లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొంది 2014లో భాజపాలో చేరారు.