శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 24 జూన్ 2018 (11:24 IST)

అడ్డదిడ్డంగా రాస్తే బుఖారీకి పట్టినగతే : జర్నలిస్టులకు బీజేపీ ఎమ్మెల్యే

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని జర్నలిస్టులకు భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే లాల్ సింగ్ ఘాటు హెచ్చరిక చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో పనిచేస్తున్న జర్నలిస్టులు హద్దులు దాటకుండా వార్తా సేకరణ చేయాలని, అడ్డద

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని జర్నలిస్టులకు భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే లాల్ సింగ్ ఘాటు హెచ్చరిక చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో పనిచేస్తున్న జర్నలిస్టులు హద్దులు దాటకుండా వార్తా సేకరణ చేయాలని, అడ్డదిడ్డంగా రాతలు రాస్తే, షుజ్జత్ బుఖారీకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఈయన పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ సర్కారులో మంత్రిగా పని చేయడం గమనార్హం.
 
ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 'కాశ్మీర్‌లో జర్నలిస్టులు ఓ తప్పుడు వాతావరణాన్ని సృష్టించారు. మీ హద్దులు మీరే నిర్ణయించుకోవాలని నేను కోరుతున్నా. మీ గురించి మీరు ఆలోచించుకోండి. జాగ్రత్త పడండి. షుజ్జత్ బుఖారీలా జీవించాలని భావిస్తే మీ ఇష్టం' అని ఆయన వ్యాఖ్యానించారు. జర్నలిస్టులకు స్వాతంత్ర్యం, స్వేచ్ఛ ఉందని, అయితే అది జాతిని, జాతీయతా భావాన్ని ఫణంగా పెట్టేలా మాత్రం ఉండబోదని లాల్ సింగ్ వ్యాఖ్యానించారు.