ఓ మహిళను తల్లిని చేసిన ఎమ్మెల్యే... డీఎన్ఏ శాంపిల్స్ సేకరణకు కోర్టు ఓకే
ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మహేశ్ నేగి చిక్కుల్లో పడ్డారు. ఆయనపై ఓ మహిళ ఇచ్చిన అత్యాచార ఫిర్యాదు ఎమ్మెల్యే మెడకు చుట్టుకుంది. తనపై ఎమ్మెల్యే అత్యాచారం చేయడం వల్ల ఓ బిడ్డకు జన్మనిచ్చినట్టు ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. తన ఆరోపణలు నిజం కాదని భావిస్తే డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు కూడా ఎమ్మెల్యే డీఎన్ఏ పరీక్ష కోసం శాంపిళ్లు ఇవ్వాల్సిందేనంటూ ఆదేశాలు జారీచేసింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆగస్టు 16వ తేదీన ఎమ్మెల్యేపై ఓ మహిళ రేప్ కేసు దాఖలు చేసింది. ఆ ఎమ్మెల్యే వల్ల తనకు కూతురు పుట్టినట్లు ఆ ఫిర్యాదు పేర్కొన్నది. ఒకవేళ తన ఆరోపణలు నిజం కాదంటే, డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని ఆమె డిమాండ్ చేసింది. తనపై ఎమ్మెల్యే అత్యాచారం జరిపారని ఆరోపించింది. ఇదే అంశంపై ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అలాగే కోర్టును కూడా ఆశ్రయించింది.
ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు... గురువారం కీలక ఆదేశాలు జారీచేసింది. ఎమ్మెల్యే మహేశ్ నేగి.. తన డీఎన్ఏ శ్యాంపిళ్లను ఇవ్వాలని ఆదేశించింది. లైంగిక వేధింపులతో సంబంధం ఉన్న కేసులో జనవరి 11వ తేదీన ఎమ్మెల్యే నేగి తన డీఎన్ఏ శ్యాంపిళ్లను ఇవ్వాలని ఆదేశించింది. అదీకూడా సీజేఎం కోర్టు సమక్షంలోనే శ్యాంపిళ్లు ఇవ్వాలని ఆదేశించారు.
అయితే ఎమ్మెల్యే నేగి ఆరోగ్యంగా లేరని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. సెప్టెంబర్‌లో ఎమ్మేల్యే నేగిపై లైంగిక ఆరోపణల కింద కేసు నమోదు అయ్యింది. బెదిరింపులకు పాల్పడిన ఆరోపణలపై ఎమ్మెల్యే భారీ రీటా నేగిపైన కూడా కేసు దాఖలు చేశారు. తన ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్ర పన్నినట్లు ఆ ఎమ్మెల్యే ఆరోపించారు.