మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 8 జూన్ 2018 (09:25 IST)

అభిమాని అని ఫోన్ నెంబర్ తీసుకుని.. అభ్యంతరకర మెసేజ్‌లు పంపి వేధించాడు

సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో మహిళలకు వేధింపులు అధికమవుతున్నాయి. తాజాగా బాలీవుడ్ ప్రముఖ గాయకురాలికి యువకుడు ఫోన్‌లో బెదిరించాడు. అసభ్య మెసేజ్‌లు పంపాడు. ఈ ఘటన దేశ వాణిజ్య నగరమైన ముంబైలో చోటుచే

సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో మహిళలకు వేధింపులు అధికమవుతున్నాయి. తాజాగా బాలీవుడ్ ప్రముఖ గాయకురాలికి యువకుడు ఫోన్‌లో బెదిరించాడు. అసభ్య మెసేజ్‌లు పంపాడు. ఈ ఘటన దేశ వాణిజ్య నగరమైన ముంబైలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ చిత్రాల్లో ఎన్నో హిట్ పాటలు పాడిన ప్రముఖ సినీ గాయనికి బీహార్ రాష్ట్రానికి చెందిన రాజేష్ కుమార్ శుక్లా (30) అభ్యంతరకర మెసేజ్‌లు పంపాడు. ఆమెను దూషిస్తూ ఫోన్ చేయడమే కాకుండా.. తాను అభిమానినంటూ వేధించాడు. 
 
రెండు వారాల క్రితం గాయని వద్దకు వచ్చి అభిమానిని అని పరిచయం చేసుకున్న శుక్లా ఆమె ఫోన్ నెంబర్ సంపాదించి అభ్యంతరకర మెసేజ్‌లు పంపించడం మొదలెట్టాడు. గాయని కదలికలపై నిఘా వుంచిన అతడు ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డాడు. గాయని ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి శుక్లాను అరెస్ట్ చేశారు.