ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 జనవరి 2024 (17:15 IST)

షాకింగ్ ఘటన.. బ్లడ్ క్యాన్సర్.. ఐదేళ్ల బాలుడిని గంగలో ముంచేశారు..

Boy
Boy
ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. క్యాన్సర్ నయమవుతుందని చిన్నారిని గంగలో ముంచింది. ఉత్తరాఖండ్ - ఢిల్లీకి చెందిన రవి (5) అనే బాలుడికి బ్లడ్ క్యాన్సర్‌ రావడంతో గంగలో ముంచితే క్యాన్సర్‌ నయమవుతుందని అతని అత్త సుధా గంగలో ఐదు నిమిషాలు ముంచింది. చుట్టుపక్కల వాళ్ళు గమనించి బయటకి తీస్తే అప్పటికే బాలుడు మృతి చెందాడు.
 
వివరాల్లోకి వెళితే... దేశ రాజధాని ఢిల్లీకి చెందిన కుటుంబం హరిద్వార్‌కు వచ్చారు. ఐదేళ్ల బాలుడితోపాటు, తల్లిదండ్రులు, మేనత్త, బంధువులు గంగానది దగ్గరకు వచ్చారు. బాలుడికి బ్లడ్ క్యాన్సర్ వచ్చినట్లు సమాచారం. అయితే.. బాలుడిని గంగానదిలో తలకిందులుగా నీళ్లలో ముంచారు. చుట్టుపక్కల వారు ఆమెను వారిస్తున్న ఏమాత్రం పట్టించుకోలేదు.
 
చివరకు ఒక భక్తులు వచ్చి బాలుడిని ఆమె నుంచి బలవంతంగా బైటకు తీసి, ఒడ్డుమీదకు తీసుకొచ్చాడు. అప్పటికి బాలుడు మృతి చెందాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.