మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 మే 2020 (19:36 IST)

పెళ్లి మండపంలో వధువుకు వాంతులు.. వరుడు ఏం చేశాడో తెలుసా?

బెంగళూరులో ఒకే కార్యాలయంలో పనిచేసే ఓ జంట ప్రేమించుకుంది. పెళ్లి పీటలు కూడా ఎక్కింది. అయితే పెళ్ళిలో వధువు వాంతులు చేసుకోవడంతో కథ అడ్డం తిరిగింది. ప్రేమ పెళ్లి చేసుకున్నామని ఆనందంలో మునిగిన ఆ జంటను వాంతులు వేరు చేశాయి.

వివరాల్లోకి వెళితే.. పెళ్లి మండపంలో  పెళ్లి జరుగుతుండగా.. వధువు నెత్తి మీద జీలకర్ర బెల్లం కూడా పెట్టాడు. తాళి కూడా కట్టాడు. ఆ ప్రాంతం అంతా బంధువులతో కోలాహలంగా ఉంది. కానీ.. ఇంతలోనే పెళ్లి కూతురు వాంతులు చేసుకుంది.
 
పెళ్లి మండపంలోనే పెళ్లి పీటల మీద ఉండగానే ఆమెకు వాంతులు అయ్యాయి. అంతే.. వరుడికి అనుమానం వచ్చింది. వధువుకు వాంతులు ఎందుకయ్యాయోనని వెంటనే ఆసుపత్రికి తరలించాడు. ఆమెకు తెలియకుండా కన్యత్వ పరీక్షలు చేయించాడు. గర్భాధారణ పరీక్షలు చేయించాడు. అయితే.. గ్యాస్టో సమస్యల కారణంగా వాంతులు జరిగాయని డాక్టర్లు తెలిపారు. 
 
అయితే.. తనకు కన్యత్వ, గర్భాధారణ పరీక్షలను వరుడు చేయించాడని తెలుసుకున్న వధువు అలాంటి వ్యక్తితో కాపురం చేయనని తేల్చి చెప్పేసింది. పెళ్లి రోజే ఇంత అనుమానం పెంచుకున్న వ్యక్తితో జీవితాంతం ఎలా బతికేదని వెంటనే విడాకులకు దరఖాస్తు చేసింది.