కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2023-24 వార్షిక బడ్జెట్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. పురోగామి భారత్‌కు ఈ బడ్జెట్ పునాది వంటిందని, దేశానికి కొత్త శక్తిని అందించే బడ్జెట్ అని ఆయన కితాబిచ్చారు.
ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ప్రధాని మోడీ జాతీనుద్దేశించి ప్రసంగించారు. అమృత కాలంలో వస్తున్న తొలి బడ్జెట్ ఇది. పురోగామి భారత్‌కు ఈ బడ్జెట్ పునాది వేస్తుందని అభిప్రాయపడ్డారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతులతో కూడిన ఆశావహ సమాజం కలలను సాకారం చేసే బడ్జెట్ అని అభివర్ణించారు. అభివృద్ధి పథంలో పయనిస్తున్న భారతకు ఈ బడ్జెట్ కొత్త శక్తిని అభినందిస్తుందని మోడీ పేర్కొన్నారు.
సంప్రదాయరీతిలో తమ చేతులతో శ్రమిస్తూ దేశ అభ్యున్నతికి పాటుపడుతున్న విశ్వకర్మలు నవభారత సృష్టికర్తు. అలాంటి విశ్వకర్మల కోసం తొలిసారిగా శిక్షణ, మద్దతులతో కూడిన ఓ పథకాన్ని ఈ కొత్త బడ్జెట్‌లో పెట్టినట్టు తెలిపారు.
ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి.. ఏవి పెరుగుతాయి?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం లోక్‌సభలో 2023-24 సంపత్సరానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వచ్చే యేడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆమె పూర్తి స్థాయి బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. ఇందులో ప్రభుత్వం కొన్నింటిపై దిగుమతి సుంకాల రాయితీ కల్పించగా, మరికొన్నింటిపై పన్ను భారం వేయడంతో కీలక వస్తువుల ధరల్లో మార్పులు రానున్నాయి. బడ్జెట్-2023 ప్రకారం.. ఏయే వస్తువుల ధరలు తగ్గుతాయి..? వేటిపై భారం పడనుందనే విషయాన్ని ఓసారి పరిశీలిస్తే..
కెమెరా లెన్సులపై కస్టమ్స్ సుంకంపై ఏడాది పాటు మినహాయింపు. టీవీ పార్టులపై ప్రస్తుతం ఉన్న 5శాతం కస్టమ్స్ సుంకాన్ని 2.5శాతానికి తగ్గించారు. దీంతో వీటి ధరలు తగ్గే అవకాశం. వెండిపై దిగుమతి సుంకాన్ని పెంచడంతో వీటి ధర పెరిగే అవకాశం.
లిథియం అయాన్ బ్యాటరీలకు అవసరమైన సామగ్రిపైనా కస్టమ్స్ సుంకాన్ని మినహాయించారు. రొయ్యల ఆహార ఉత్పత్తుల దిగుమతిపైనా కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు. దీంతో దేశీయంగా తయారు చేసే వాటి ధరలు తగ్గుతాయి.
అలాగే, ధరలు తగ్గేవి వస్తువులను పరిశీలిస్తే, మొబైల్, ల్యాప్‌టాప్, డీఎస్‌ఎల్‌ఆర్‌ల కెమెరా లెన్సులు, టీవీ ప్యానెల్ పార్టులు, లిథియం అయాన్ బ్యాటెరీలు, ఎలక్ట్రిక్ వాహనాలు, దేశీయంగా ఉత్పత్తి చేసే రొయ్యల ఆహారం, డైమండ్‌ల తయారీ వస్తువులు ఉన్నాయి.
బంగారం, ప్లాటినంతో తయారు చేసే వస్తువుల ధరలు పెరుగుతాయి. అలాగే, వెండి ఉత్పత్తులు, సిగరెట్లు, టైర్లు, దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్ చిమ్నీలు, రాగి తుక్కు, రబ్బర్ వంటి వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది.