శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 7 ఆగస్టు 2019 (08:28 IST)

ఫ్లిప్‌కార్ట్-అమెజాన్ పోటాపోటీ ఆఫర్లు!

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్-ఫ్లిప్‌కార్ట్‌లు పోటాపోటీ ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వస్తున్నాయి. అమెజాన్ ఫ్రీడం సేల్ పేరుతో ఈ నెల 8 నుంచి 11 వరకు నాలుగు రోజుల పాటు భారీ ఆఫర్లు ప్రకటించింది. మరోవైపు 8వ తేదీ నుంచే ఫ్లిప్‌కార్ట్ నేషనల్ షాపింగ్ డేస్ సేల్ ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు జరగనున్నఈ సేల్ 10న ముగుస్తుంది.
 
అమెజాన్ ఫ్రీడం సేల్‌లో టాప్ బ్రాండ్ మొబైల్ ఫోన్లపై భారీ రాయితీలు లభించనున్నాయి. వన్ ప్లస్ 7, శాంసంగ్ గెలాక్సీ ఎం30, రెడ్‌మి వై30, ఆనర్ 20ఐ, రెడ్‌మి 7, నోకియా 6.1 ప్లస్, ఆనర్ 8 ఎక్స్, రెడ్‌మి 6ఎ, ఎల్‌జి డబ్ల్యూ10 స్మార్ట్‌ఫోన్లతోపాటు పలు ఇతర మొబైళ్లపైనా భారీ రాయితీలు అందిస్తోంది. దీంతో పాటు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై చేసే కొనుగోళ్లపై 10 శాతం తక్షణ రాయితీ లభిస్తుంది.
 
ఫ్లిప్‌కార్ట్ నేషనల్ షాపింగ్ డేస్ సేల్‌లో మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లెట్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీ స్పీకర్లు, ఇతర పాపులర్ ప్రొడక్ట్ కేటగిరీల్లోనూ భారీ రాయితీలు ప్రకటించింది. అలాగే సేల్ మధ్యలో ప్లాష్ సేల్ కూడా నిర్వహించనుంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేసే వారికి పది శాతం తక్షణ డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. 
 
రెడ్‌మి 7 ప్రొ, రెడ్‌మి నోట్ 7ఎస్, రియల్‌మి 3 ప్రొ, ఆనర్ 20ఐ, ఒప్పో కే1 వంటిపై రాయితీలు ప్రకటించగా, ఆనర్ 9ఎన్, ఆనర్ 9ఐ, ఆసుస్ 5జడ్, శాంసంగ్ గెలాక్సీ -ఎ సిరీస్ ఫోన్లను అత్యంత చవగ్గా సొంతం చేసుకోవచ్చు.