Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జీవించాల‌నే కోరిక చచ్చిపోయింది... జిల్లా కలెక్టర్ సూసైడ్

శుక్రవారం, 11 ఆగస్టు 2017 (14:10 IST)

Widgets Magazine
mukesh panday

ఓ దారుణం జరిగింది. బీహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లా కలెక్టర్ (మేజిస్ట్రేట్) ఆత్మహత్య చేసుకున్నారు. ఆ అధికారి పేరు ముఖేష్ పాండే. ఆయన మృతదేహాన్ని ఘజియాబాద్‌లోని ఓ రైల్వే ట్రాక్ వద్ద ఛిద్రమైన స్థితిలో పోలీసులు కనుగొన్నారు. అయితే, తన ఆత్మహత్యకు ఏ ఒక్కరూ కారణం కాదనీ, తన సొంత నిర్ణయంతోనే బలవన్మరణానికి పాల్పడుతున్నానని పాండే తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. 
 
"మనిషి అనేవాడికి ఈ భూమిపై మనుగడ లేదని త‌న‌కు జీవించాల‌నే కోరిక చచ్చిపోయిందని, త‌న మ‌ర‌ణం గురించి త‌న‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందజేయండని" అని సూసైడ్ నోట్‌లో రాశాడు. 
 
అంతకుముందు ఆయన ఢిల్లీకి వెళ్లి అక్కడ ఉన్న లీలా ప్యాలెస్ హోటల్‌లోని 742 గదిలో బస చేశారు. ఈ గదిలో సూసైడ్ నోట్ కూడా రాసి ఉంచార‌ని పోలీసులు తెలిపారు. అలాగే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డేముందు స‌ద‌రు క‌లెక్ట‌ర్ త‌న స్నేహితుల‌కు ఫోన్ చేసి, ఢిల్లీలోని జానకీపురిలోని ఓ షాపింగ్ మాల్ పైనుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని చెప్పాడ‌ని అన్నారు. 
 
అయితే, ముఖేష్ పాండే రైల్వే స్టేషన్ వైపు వెళ్లి అక్క‌డ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. 2012 బ్యాచ్‌కు చెందిన ముకేష్ పాండేకు సమర్థుడైన అధికారిగా గుర్తింపు పొందడమేకాకుండా మంచి పేరు కూడా ఉంది. క‌లెక్ట‌ర్‌ మృతి పట్ల బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్‌ కుమార్ సంతాపం తెలిపారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

స్టోర్‌ రూంకు తీసుకెళ్లి "సెక్సీగా, హాట్‌గా ఉన్నావు... కోరిక తీర్చమన్న" సీనియర్...

దేశవాణిజ్య రాజధాని ముంబైలో ఓ యువతి సీనియర్ ఉద్యోగి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొంది. ...

news

శిశువును ప్లాస్టిక్ పేపర్లో చుట్టి కొరియర్ చేసింది: పార్శిల్ కదిలింది.. ఏడుపు శబ్ధం వినిపించడంతో?

ముక్కుపచ్చరాలని శిశువును ఓ ప్లాస్టిక్ పేపర్లో చుట్టి పార్సెల్ చేసి ఓ మహిళ కొరియర్ ద్వారా ...

news

ఇంట్లో కూర్చోబెట్టాల్సింది అమ్మాయిలను కాదు... అబ్బాయిలను : బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్

హర్యానా రాష్ట్రంలో ఓ ఐఏఎస్ కుమార్తెను హర్యానా రాష్ట్ర బీజేపీ చీఫ్ సుభాష్‌ బరాలా కుమారుడు ...

news

పెళ్ళికంటూ బయల్దేరి జైలు డాబాపై దిగిన హెలికాఫ్టర్.. పరుగులు తీసిన సిబ్బంది..

పెళ్ళి వేడుక కోసం హెలికాప్టర్‌లో బయల్దేరిన ఓ కుటుంబం.. నేరుగా కళ్యాణ మండపానికి వెళ్లకుండా ...

Widgets Magazine