శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 డిశెంబరు 2019 (13:29 IST)

సెల్‌ఫోన్ కొంటే ఉల్లిపాయలు ఫ్రీ.. ఎక్కడో తెలుసా?

ఉత్తరప్రదేశ్‌లోని ఓ స్మార్ట్‌ఫోన్ల స్టోర్ సూపర్ ఆఫర్ ప్రకటించింది. ఉల్లిపాయల రేట్లు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో సెల్‌ఫోన్ కొంటే ఉల్లిపాయలు ఫ్రీ అని బోర్డ్ పెట్టింది. దాంతో... జనం ఎగబడి సెల్‌ఫోన్లు కొనుక్కుంటున్నారు. 
 
మిగతా రాష్ట్రాల్లోలాగే యూపీలోనూ ఉల్లిపాయల ధరలు దిగిరావట్లేదు. ధరలు ఎలా తగ్గించాలో... యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి తెలియట్లేదు. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా... ఉల్లి ధరలు దిగిరావట్లేదు.
 
ఈ నేపథ్యంలో ఓ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఉల్లి ధరల పెంపును క్యాష్ చేసుకుంటోంది. కాగా ప్రస్తుతం వారణాసిలో కేజీ ఉల్లి రూ.130 నుంచీ రూ.135 ఉంది. అందుకే అక్కడి లాగురాబిర్‌లో ఓ సెల్‌ఫోన్ షాప్ ఓ స్మార్ట్‌ఫోన్ కొంటే కేజీ ఉల్లిపాయలు ఫ్రీ అని బోర్డ్ పెట్టింది. 
 
ఈ బోర్డు పెట్టిన తర్వాత... అక్కడకు కస్టమర్ల రాక పెరిగింది. సిటీలో ఎక్కడెక్కడో మొబైల్ కొనుక్కోవాలనుకునేవాళ్లంతా... ఆ షాపుకే వచ్చి కొనుక్కుంటున్నారు.