Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

100% ఫిట్... రాజీనామా చేయను... డిస్మిస్ చేసుకోండి.. ఉమాభారతి మొండిపట్టు

ఆదివారం, 3 సెప్టెంబరు 2017 (10:01 IST)

Widgets Magazine

కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు జలవనరుల శాఖామంత్రి ఉమాభారతి నిరాకరించారు. అనారోగ్య కారణాలను సాకుగా చూపి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరడాన్ని ఆమె తప్పుబడుతున్నారు. 
 
ఇదే అంశంపై ఆమె బీజేపీ సీనియర్ నేతల వద్ద స్పందిస్తూ... ఆరోగ్యపరంగా తాను వంద శాతం ఫిట్నెస్‌గా ఉన్నాను. కానీ, తనను అనారోగ్య కారణాల పేరుతో మంత్రివర్గం నుంచి తప్పించాలని చూస్తే మాత్రం సహించబోనని హెచ్చరించారు. తానైతే రాజీనామా చేయబోనని, కావాలంటే తనను డిస్మిస్ చేసుకోవాలని ఉమ తెగేసి చెప్పినట్టు సమాచారం. 
 
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కోసం పనితీరు సరిగా లేని 8 మంది మంత్రుల నుంచి అమిత్ షా రాజీనామా కోరినట్టు తెలుస్తోంది. అందులో ఉమా భారతి కూడా ఉన్నారు. ప్రధాని మోడీ మానసపుత్రిక అయిన నమామి గంగా పథకం అమల్లో ఉమ పనితీరు సంతృప్తికరంగా లేకపోవడంతో ఆమెను రాజీనామా కోరినట్టు సమాచారం. 
 
అయితే తాను రాజీనామా చేసేది లేదని, తనను తొలగించాలనుకుంటే డిస్మిస్ చేయాలని అధిష్టానానికి ఉమ స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. దీంతో ఉమా భారతి విషయంలో ఏం చేయాలనే విషయంలో అధిష్టానం సందిగ్ధంలో పడింది. పైగా, ప్రధాని మోడీపై తొలిసారి మహారాష్ట్రకు చెందిన ఓ బీజేపీ ఎంపీ ధిక్కార స్వరం వినిపించగా తాజాగా ఉమాభారతి ఇదే తరహా వైఖరిని అవలంభించడం గమనార్హం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కొత్త మంత్రులు వీరే.. వైజాగ్ ఎంపీ హరిబాబుకు మొండిచేయి?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాజాగా చేపట్టబోతున్న కేంద్ర మంత్రిమండలి పునర్య్వవస్థీకరణలో ...

news

విజయనగరంలో కీచక పర్వం : టెన్త్ బాలికపై గ్యాంగ్‌రేప్, హత్య

విజయనగరం జిల్లాలో కీచక పర్వం జరిగింది. ఓ పదో తరగతి చదివే బాలికపై నలుగురు కామాంధులు ...

news

రెండో ధనిక రాష్ట్రంలో గేదెలకు బీమా...

దేశంలో రెండో ధనిక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రంలో మనుషుల సంగతి ఏమోగానీ, పశువుల ...

news

సిపిఎంతో కమల్ దోస్తీ - త్వరలో సీతారాం ఏచూరితో భేటి..

లెఫ్ట్ నేతలతో తనకున్న ప్రేమను చాటుకుని కేరళ సిఎం విజయ్‌ను కలిసిన నటుడు కమల్ హాసన్ వారిని ...

Widgets Magazine