ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 మార్చి 2024 (11:15 IST)

పరిచయం లేని స్త్రీను డార్లింగ్ అని పిలిస్తే అది లైంగిక వేధింపు : కోల్‌కతా హైకోర్టు

court
మనకు ఇష్టమైనవారిని డార్లింగ్ అన పిలవడం సాధారణమైన విషయం. అందులో తప్పేమీ ఉండదు. కానీ, పరిచయం లేని మహిళలను డార్లింగ్ అని పిలిస్తే మాత్రం కష్టాలు తప్పవండోయ్. కోల్‌కత్తా హైకోర్టు ఈ అంశంపై ఏమని తీర్పు ఇచ్చిందో ఓసారి చూడండి. 
 
అసలేం జరిగిందంటే.. కోల్‌కతాలో దుర్గాపూజ సందర్భంగా బందోబస్తు కోసం మహిళా పోలీసులను కూడా నియమించారు. అయితే, ఓ వ్యక్తి మహిళా కానిస్టేబుల్‌ను డార్లింగ్‌ అని పిలిచాడు. దాంతో ఆ మహిళా పోలీసు సదరు వ్యక్తిపై మాయాబందర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, అతడిపై కేసు నమోదైంది. 
 
ఈ కేసు విచారణ సందర్భంగా కోల్‌కతా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఏ మాత్రం పరిచయం లేకుండానే ఓ మహిళను డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపు కిందికి వస్తుందని స్పష్టం చేసింది. అలా పిలిచిన వారిని ఐపీసీ 354ఏ, 509 సెక్షన్ల కింద విచారించవచ్చునని హైకోర్టు పేర్కొంది. పరిచయం లేని మహిళ పట్ల డార్లింగ్ అనే పదాన్ని ఉపయోగించడం అసభ్యత కిందికి వస్తుందని కోల్‌కతా హైకోర్టు ధర్మాసనం వివరించింది.