శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 18 నవంబరు 2016 (17:25 IST)

వోయ్... నేను మంత్రిని.. నేను క్యూలో నిలబడను.. బ్యాంకులో యూపీ మంత్రి హంగామా

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి నానా హంగామా సృష్టించారు. తన వద్ద ఉన్న చెల్లని పెద్ద నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుకు వచ్చిన ఆయన.. తన అధికార దర్పాన్ని ప్రదర్శించారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి నానా హంగామా సృష్టించారు. తన వద్ద ఉన్న చెల్లని పెద్ద నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుకు వచ్చిన ఆయన.. తన అధికార దర్పాన్ని ప్రదర్శించారు. నేను మంత్రిని, అందరిలాగా క్యూలో రాను.. అంటూ వారిని కించపరిచేలా మాట్లాడాడు. ఆ మంత్రి పేరు ఇక్బాల్ మెహమూద్. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా కొనసాగుతున్నారు. 
 
పెద్ద నోట్ల రద్దుతో పాతనోట్ల మార్పిడికి, ఖర్చుల కోసం కొత్త నోట్లు తీసుకోవడానికి ఓ పక్క ప్రజలు గంటల తరబడి బ్యాంకుల ఎదుట నిరీక్షిస్తున్నారు. వారి కష్టాన్ని అర్థం చేసుకుని నాలుగు సాంత్వన వచనాలు పలకాల్సిన ప్రజా ప్రతినిధి అయివుండి అలా చేయకపోగా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఇక్బాల్‌ మెహమూద్‌.. 
 
ఈయన శుక్రవారం తన కుటుంబీకులు, స్నేహితులతో కలిసి నగదు డిపాజిట్‌ చేసుకోవడానికి సంభాల్‌ ప్రాంతంలోని ఓ బ్యాంక్‌కు వెళ్లారు. అప్పటికే ఆ  బ్యాంకు వద్ద అనేక మంది గంటల తరబడి వరుస క్రమంలో నిలుచునివున్నారు. వీరిని ఏమాత్రం పట్టించుకోని బ్యాంకు సిబ్బంది... మంత్రి రాగానే గబగబా గేట్లు తీసి ఆయన్ని సగౌరవంగా బ్యాంకులోకి తీసుకెళ్లారు. ఆగమేఘాల మీద ఆయనకు నోట్ల మార్పిడి పని చేసిపెట్టారు. 
 
అప్పటికైనా డబ్బు తీసుకుని ఆ మంత్రి మెదలకుండా వెళ్లిపోకుండా 'నేను మంత్రిని.. లైన్‌లో నిలబడాల్సిన అవసరం నాకు లేదు..' అంటూ వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. క్యూలో నిలబడిన ఖాతాదారులు బ్యాంక్‌ సిబ్బందిపై విరుచుకుపడ్డారు.