శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 ఏప్రియల్ 2022 (11:02 IST)

పడకగదిలో ప్రియుడితో రాసలీలలు.. భర్త కంటపడటంతో..?

crime scene
బీహార్‌లో దారుణం చోటుచేసుకుంది. భార్య వేరొక వ్యక్తితో పడకగదిలో రాసలీలలు కొనసాగిస్తుండగా భర్త కంటపడింది. అంతే ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. తమ గుట్టు రట్టవడంతో ప్రియుడితో కలిసి కట్టుకున్నభర్తనే చంపేసిన ఘటన బీహార్‌లోని పుర్నియ జిల్లా చకర్పద గ్రామంలో చోటుచేసుకుంది.  బాధితుడిని పోషిత్ కుమార్‌గా గుర్తించారు.
 
వివరాల్లోకి వెళితే.. కుమార్ భార్య సావిత్రి దేవి అదే గ్రామానికి చెందిన అరవింద్ మహల్దార్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగిఉంది. కుమార్ పని నుంచి ఇంటికి తిరిగి వచ్చిన సమయంలో భార్య సావిత్రి ప్రియుడితో సన్నిహితంగా ఉండటం చూసి కంగుతిన్నాడు. 
 
తమ బండారం బయటపడటంతో సావిత్రి ప్రియుడు మహల్దార్‌తో కలిసి కుమార్ మెడకు తాడు బిగించి ఉసురు తీసింది. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కుమార్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.