శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 12 సెప్టెంబరు 2016 (18:31 IST)

బెంగళూరులో మేక మెదళ్లు... కావేరి సమస్యపై సుప్రీం చెప్పిన తర్వాత కూడానా...?

కావేరీ సమస్యపైన సోషల్ మీడియాలో ఎవరిష్టం వచ్చినట్లు వారు కామెంట్లు చేసేస్తున్నారు. చెన్నైలో కర్నాటక హోటళ్లపై దాడి చేయడం, కర్నాటకలో కొందరు తమిళులపై చేయి చేసుకోవడం వంటి ఘటనలతో ఉద్రిక్తతలు ఎక్కువయ్యాయి. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో కర్నాటక ప్రభుత్వం రెం

కావేరీ సమస్యపైన సోషల్ మీడియాలో ఎవరిష్టం వచ్చినట్లు వారు కామెంట్లు చేసేస్తున్నారు. చెన్నైలో కర్నాటక హోటళ్లపై దాడి చేయడం, కర్నాటకలో కొందరు తమిళులపై చేయి చేసుకోవడం వంటి ఘటనలతో ఉద్రిక్తతలు ఎక్కువయ్యాయి. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో కర్నాటక ప్రభుత్వం రెండు రాష్ట్రాల మధ్య బస్సు రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది. అలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదంటూ విజ్ఞప్తి చేసింది. ఐతే సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో మాత్రం ఎవరికివారు దుర్భాషలాడుతున్నారు. 
 
ఓ ట్విట్టర్ ఖాతాదారుడు... బెంగుళూరులో మేక మెదళ్లు... సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఏంటీ ఆందోళనలు, గొడవలు అంటూ పోస్ట్ చేశాడు. ఇతడిలానే ఎందరో ఎవరికితోచినట్లు వారు రాస్తున్నారు. దీనిపై కర్నాటక హోంమంత్రి స్పందిస్తూ... రెచ్చగొట్టే వ్యాఖ్యలను నిలువరింపజేయం కష్టంగా ఉందనీ, ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల పాత్ర మరింత విస్తరించడంతో ఎవరు ఎక్కడ నుంచి స్పందిస్తున్నారో తెలుసుకుని వారివారి వ్యాఖ్యలను బ్లాక్ చేయడం కష్టతరంగా మారుతోందన్నారు. ముందుజాగ్రత్త చర్యగా 144వ సెక్షన్ విధించినట్లు ఆయన చెప్పారు.