మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 11 మే 2018 (08:36 IST)

ఉన్నావో బాధితురాలిపై బీజేపీ ఎమ్మెల్యే, అతని స్నేహితుల గ్యాంగ్ రేప్ : తేల్చిన సీబీఐ

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావో అత్యాచార బాధితురాలి కేసులో సీబీఐ సంచలన నిజాలను వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అధికార బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌తో పాటు అతని ముగ్గురు స్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావో అత్యాచార బాధితురాలి కేసులో సీబీఐ సంచలన నిజాలను వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అధికార బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌తో పాటు అతని ముగ్గురు స్నేహితులు పలుమార్లు అత్యాచారం జరిపారని నిర్ధారించింది. ఈ యువతిని ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పిన జూన్ 4వ తేదీన ఎమ్మెల్యే కుల్దీప్ ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం జరిపినట్టు వెల్లడించింది.
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మాఖీ గ్రామంలో గత ఏడాది జూన్ 4వ తేదీన బాధిత బాలికపై ఎమ్మెల్యమే కుల్దీప్ సింగ్ సెంగార్ అత్యాచారం జరిపింది నిజమేనని సీబీఐ వెల్లడించింది. తన స్నేహితురాలు శశిసింగ్ గది బయట కాపలా కాయగా ఎమ్మెల్యే బాలికపై అఘాయిత్యం చేశాడని పేర్కొంది. నిందితుడైన బీజేపీ ఎమ్మెల్యేపై స్థానిక యూపీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం చేశారని తేలింది. సీబీఐ బాధిత బాలిక సాక్ష్యాన్ని మెజిస్ట్రేట్ సమక్షంలో రికార్డు చేసింది. 
 
అత్యాచారానికి గురైన బాలికను వైద్యపరీక్ష చేయించడంలో అధికారులు జాప్యం చేశారని సీబీఐ వెల్లడించింది. దీంతోపాటు బాలిక దుస్తులను ఫోరెన్సిక్ ల్యాబ్ కు కావాలని పంపించలేదని తేలింది. ఎమ్మెల్యేను రేప్ కేసు నుంచి కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించారని తేలింది. జూన్ 11వ తేదీన ఎమ్మెల్యేనే కాకుండా శుభంసింగ్, అవధ్ నారాయణ్, బ్రిజేష్ యాదవ్‌లు బాలికపై పలుసార్లు సామూహిక అత్యాచారం జరిపారని తేలింది.
 
దీంతో బాధితురాలు జూన్ 20వతేదీన అక్కడి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు చేసినా ఈ కేసులో ఎమ్మెల్యేను తప్పించి మిగతా ముగ్గురిపై రేప్ కేసు పెట్టారు. ఆ తర్వాత ప్రజాందోళన అనంతరం యూపీ సర్కారు ఉన్నావో రేప్ కేసు దర్యాప్తు బాధ్యతను సీబీఐకు అప్పగించింది. ఈ కేసులో అత్యాచార బాధితురాలి తండ్రి కూడా పోలీస్ విచారణలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే.