1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 ఆగస్టు 2021 (12:45 IST)

CBSE 10వ తరగతి ఫలితాల విడుదల

cbse exam
CBSE బోర్డు ముందుగా నిర్ణయించిన ప్రకటన ప్రకారం 10వ తరగతి ఫలితాన్ని ప్రకటించింది. ఫలితాలు ప్రకటించిన వెంటనే, 10వ తరగతి చదివే 18 లక్షల మంది విద్యార్థుల నిరీక్షణ ముగిసినట్లుగా అయ్యింది. విద్యార్థులు cbse.nic.in మరియు cbse.gov.in. బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాన్ని చూసుకోవచ్చు.
 
CBSE 10వ తరగతికి చెందిన 18 లక్షల మంది విద్యార్థులు తమ రోల్ నంబర్‌ను సిద్ధంగా ఉంచుకుని, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇచ్చిన తాజా అప్‌డేట్ ప్రకారం, 10వ ఫలితాలు మధ్యాహ్నం 12గంటలకు విడుదల చేయబడ్డాయి. CBSE 10వ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్ cbseresults.nic.in మరియు cbse.gov.in లో విడుదల చేశారు.
 
విద్యార్థులు తమ ఫలితాలను సులభంగా వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు అని అధికారులు చెబుతున్నారు. ఈమేరకు CBSE ప్రధాన కార్యాలయం ట్విట్టర్‌లో ట్వీట్ ద్వారా వివరాలు వెల్లడించింది.