శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 జులై 2020 (13:46 IST)

సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదల.. మెరిట్ లిస్ట్‌ నో

సీబీఎస్ఈ పదో తరగతి తుది ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. కొన్ని సబ్జెక్టులకే మాత్రమే పరీక్షలు జరిపిన సీబీఎస్‌ఈ కరోనా పరిస్థితుల కారణంగా మిగతా వాటిని రద్దు వేసిన విషయం తెలిసిందే. ఈ సబ్జెక్టులకు సంబంధించి ప్రత్యామ్నాయ మదింపు ఆధారంగా విద్యార్థుల ప్రతిభను అంచనా వేసి ఫలితాను ప్రకటించింది. 12వ తరగతి లాగే 10వ తరగతి ఫలితాల్లో మెరిట్ లిస్ట్‌ను సీబీఎస్ఈ విడుదల చేయలేదు.
 
సోమవారమే సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేయగా, రెండు రోజుల్లోనే సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఏడాది 18 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. ఈ ఫలితాలను www.cbseresults.nic, www.cbse.nic.in వెబ్‌సైట్లలో చూసుకోవాలని కేంద్రం తెలిపింది. ఉమాండ్‌ మొబైల్‌ యాప్‌, 011-24300699 టోల్ ‌ఫ్రీ నంబర్‌ ద్వారా ఫలితాలు‌ తెలుసుకోవచ్చని పేర్కొంది.
 
కాగా.. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా సీబీఎస్ఈ 12వ తరగతి, 10వ తరగతి పరీక్షలు పెండింగ్‌లో పడ్డాయి. పెండింగ్‌లో ఉన్న ఎగ్జామ్స్ నిర్వహించేందుకు సీబీఎస్ఈ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించడంతో ఈ పరీక్షల్ని రద్దు చేసి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా పరీక్షల ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే.