బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 మార్చి 2024 (15:16 IST)

అడల్ట్ వెబ్ సిరీస్‌లు ప్రసారం చేస్తున్న 18 ఓటీటీలపై కేంద్రం కొరఢా...

shooting
ఓటిటి ప్లాట్ ఫామ్స్‌లో సెన్సార్ వంటివి లేకపోవడంతో పలు ఓటీటీ కంపెనీలు అడల్ట్ వెబ్‌సిరీస్‌లు, విచ్చలవిడి కంటెంట్‌తో నిండిన సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్‌ప్లిక్స్, అమెజాన్, హాట్‌స్టార్ లాంటి టాప్ ఓటిటిలతో పాటు కేవలం‌ వల్గర్ కంటెంట్‌తో కూడిన పలు ఓటిటి యాప్స్ ఇండియాలో ప్రాచుర్యంలో ఉన్నాయి. అవి ఎక్కువ స్థాయిలో అశ్లీలతను ప్రచారం చేస్తుండడంతో, అలాంటి 18 యాప్స్‌ని భారత ప్రభుత్వం ఇప్పుడు నిషేధించినట్టుగా తెలుస్తుంది. 
 
కేంద్ర సమాచార, బ్రాడ్ కాస్టింగ్ మినిస్ట్రీ వారు ఈ నిర్ణయాన్ని తీసుకొని భారీ ఎత్తున అశ్లీల కంటెంట్‌ని ఓటిటి‌లో ప్రమోట్ చేస్తున్న 18 యాప్స్‌పై నిషేధం విధించారు. వీటికి సంబంధిత 57 సోషల్ మీడియా అకౌంట్స్‌ని సోషల్ మీడియా యాప్స్‌లో అలాగే వాటి అనుబంధ వెబ్‌సైట్స్ మొత్తం 19ని కూడా శాశ్వతంగా తొలగించారు.
 
కేంద్రం నిషేధం విధించిన ఓటీటీల జాబితాను పరిశీలిస్తే : డ్రీమ్స్ ఫిల్మ్స్, వూవి, యెస్స్మా, అన్‌కట్ అడ్డా, ట్రై ఫ్లిక్స్, ఎక్స్ ప్రైమ్, నియాన్ ఎక్స్ విఐపి, బేషరమ్స్, హంటర్స్, రాబిట్, ఎక్స్‌ట్రామూడ్, న్యూఫ్లిక్స్, మూడ్‌ఎక్స్, మోజ్‌ఫ్లిక్స్, హాట్ షాట్స్ విఐపి, ఫుగీ, చికూఫ్లిక్స్, ప్రైమ్ ప్లే వంటి ఓటీటీలు ఉన్నాయి.