వీధి వ్యాపారులకు ఏం సంపాదన వస్తుందిలే అనుకునేరు.. వారంతా కోటీశ్వరులే!
వ్యాపారం చేసేవారు ఎవరైనా సరే ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి.. లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ వీధి వ్యాపారులకు ఐటీ వల్ల ఇబ్బందులుండవు. వీధి వ్యాపారులకు ఏం సంపాదన వుంటుందని అందరూ అనుకుంటారు. కానీ వీధి వ్యాపారులకు ఏం సంపాదన వుంటుందని నిర్లక్ష్యం చేసిన కొందరికి ఐటీ అధికారులు గట్టి షాక్ ఇచ్చారు.
యూపీలోని కొందరు వ్యాపారులపై దృష్టిపెట్టి కోట్లలో సంపాదించినట్లు గుర్తించారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. 256 మంది చిరు వ్యాపారులకు సంబందించిన డేటాను ఆదాయపన్ను అధికారులు సేకరించారు. ఈ డేటాలో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. వారంతా కోటీశ్వరులని తేలింది.
చిరు వ్యాపారాలు చేసుకుంటూ డబ్బు కూడబెట్టి కోట్లు సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఖరీదైన ప్రాంతాల్లో వీరికి కోట్ల విలువ చేసే బంగళాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ప్రభుత్వానికి ఒక్క రూపాయి పన్నుకూడా కట్టకుండా చిరు వ్యాపారం చేస్తూ డబ్బులు కూడబెడుతున్నారని లాక్‌డౌన్ సమయంలో వీరిలో చాలామంది పెద్ద ఆస్తులు కొనుగోలు చేసినట్టు ఆదాయపన్నుశాఖ తెలియజేసింది. ఇక వీరి నుంచి పన్ను వసూలు చేసే పనిలో పడ్డారు అధికారులు. ఇప్పటికే 256 మందికి సంబంధించిన ఆస్తుల వివరాలు సేకరించారు.