శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 16 ఆగస్టు 2017 (06:04 IST)

జాతిపిత కల ఇంకా నెరవేరనే లేదు.. స్వాతంత్ర్యదినోత్సవం రోజు.. పట్టపగలే బాలికపై అత్యాచారం..

జాతిపిత మహాత్మాగాంధీ కల ఇంకా నెరవేరనే లేదు. అర్థరాత్రి మహిళలు వీధుల్లో స్వేచ్ఛగా తిరిగే రోజున స్వాతంత్ర్యం వచ్చినట్లని ఆయన చెప్పిన మాట నిజమైంది. ఎందుకంటే.. ప్రస్తుతం పట్టపగలే వీధుల్లో మహిళలు స్వేచ్ఛగా

జాతిపిత మహాత్మాగాంధీ కల ఇంకా నెరవేరనే లేదు. అర్థరాత్రి మహిళలు వీధుల్లో స్వేచ్ఛగా తిరిగే రోజున స్వాతంత్ర్యం వచ్చినట్లని ఆయన చెప్పిన మాట నిజమైంది. ఎందుకంటే.. ప్రస్తుతం పట్టపగలే వీధుల్లో మహిళలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి. అదీ స్వాతంత్ర్యదినోత్సవం రోజునే బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన చంఢీఘడ్‌‌లో చోటుచేసుకుంది. 
 
పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొనేందుకు వెళుతున్న ఓ బాలిక దారుణంగా అత్యాచారానికి గురైంది. ఛండీగఢ్‌లో మంగళవారం ఓ 12 ఏళ్ల బాలిక తన పాఠశాలలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు బయల్దేరింది. షార్ట్‌కట్‌లో వెళ్దామనుకుని.. ఛండీగఢ్‌ సెక్టార్‌ 23లో చిల్డ్రన్స్‌ పార్కులోకి వెనుక గేటు గుండా ప్రవేశించింది. ఆ సమయంలో ఓ వ్యక్తి ఆమెను చాకుతో బెదిరించి పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు.
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. బాలికను మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచి వాంగ్మూలం తీసుకుని.. వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. అత్యాచారానికి తర్వాత ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని ఇంటికొచ్చిన బాధితురాలు.. తల్లిదండ్రులతో జరిగిందంతా చెప్పిందని.. 100కు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పడంతో కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. బాధితురాలు ఎనిమిదో తరగతి చదువుతోందని వారు తెలిపారు.