మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

పంజాబ్ ముఖ్యమంత్రి ఇంటికి రూ.10 వేల జరిమానా

bhagwant mann
పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ ఇంటికి చండీగఢ్ మున్సిపాలిటీ అధికారులు రూ.10 వేల జరిమానా విధించారు. చండీగఢ్‌లోని ఆయన ఉండే ఇంటి వెలుపల చెత్త కనిపించింది. దీనిపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు రూ.10 వేల అపరాధం విధించారు. 
 
సీఆర్పీఎఫ్ బెటాలియన్ డిప్యూటీ సూపరింటెండెంట్ హర్జీందర్ సింగ్ పేరిట ఈ మేరకు చలాన్ జారీ అయింది. ఇందులో పంజాబ్ సీఎం ఇంటి చిరునానా ఉండటం గమనార్హం. 
 
దీనిపై స్థానిక బీజేపీ కౌన్సిలర్ మహేశిందర్ సింగ్ సిద్ధూ స్పందిస్తూ, సీఎం నుంచి చెత్త పారబోస్తున్నారంటూ స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీంతో చెత్తను రోడ్డుపై పడేయొద్దంటూ పలుమార్లు సీఎం ఇంటి సిబ్బందికి తెలిపినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోలేదని అందుకే అధికారులు రూ.10 వేల అపరాధం విధించారని తెలిపారు.