Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జగన్ ముగ్గురాళ్లు దోచుకుంటే? నీవు విషపు మొక్కను నీళ్లు పోసి వటవృక్షం చేస్తున్నావా?

గురువారం, 16 ఫిబ్రవరి 2017 (09:30 IST)

Widgets Magazine

కడప జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు బుధవారం టీడీపీలో చేరిన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు. అవినీతికి పాల్పడే వ్యక్తులు రాజకీయాల్లో ఉండడానికి అర్హులు కారన్నారు. కడప అభివృద్ధిపై మాటలు చెప్పి ముగ్గురాళ్ళు కూడా దోచుకున్న చరిత్ర వారిదని ప్రతిపక్ష నేత  జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. 
 
అక్రమాస్తుల కేసులో తమిళనాడులో శశికళ జైలుకు వెళ్ళడం చూశామని, మన రాష్ట్రంలోని కొందరు నేతలు ఆమెకన్నా ఎన్నో రెట్లు అవినీతికి పాల్పడ్డారని జగన్‌ను పరోక్షంగా ఏకిపారేశారు. తమ ప్రభుత్వం పులివెందులకు నీళ్ళిచ్చినా ఆయనకు కడుపుమంటగా ఉందని ఎద్దేవా చేశారు. 
 
కానీ టీడీపీలో ఉన్న అవినీతి చేపల చరిత్రేంటని వైకాపా నేతలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీలోని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమ సంపాదన గురించి మీకు తెలియదా అన్న సెటైర్లు పేలుతున్నాయి.
 
ఇదిలా ఉంటే కర్నూలు జిల్లా ఆళగడ్డ టీడీపీ ఇన్‌చార్జ్ గంగుల ప్రభాకర్ రెడ్డి వైసీపీలో చేరుతున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన గంగుల ప్రభాకర్ రెడ్డి.. భూమానాగిరెడ్డి, చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. భూమా నాగిరెడ్డి ఒక విషం నిండిన మొక్క అని వ్యాఖ్యానించారు. ఆ విష మొక్కను వటవృక్షంగా మార్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని గంగుల విమర్శించారు.
 
గత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆళ్లగడ్డకు వచ్చి ఆళ్లగడ్డలో భూమా అనే విషపు మొక్కను నాటాను అని స్వయంగా చంద్రబాబే వ్యాఖ్యానించారని గంగుల ప్రభాకర్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు అదే విష మొక్కకు చంద్రబాబు నీళ్లు పోసి వటవృక్షం చేసే పనిలో ఉన్నారని విమర్శించారు.

చంద్రబాబు చొక్కా విప్పితే ఆయన శరీరం నిండా ఇలాంటి మచ్చలే కనిపిస్తాయన్నారు. టీడీపీ నీచమైన చరిత్ర మొత్తం తన గుప్పెట్లో ఉందని గతంలో అనేక సార్లు విమర్శలు చేసిన వ్యక్తిని ఇప్పుడు పార్టీలోకి చేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలని గంగుల డిమాండ్ చేశారు.
 
ఆళ్లగడ్డలో టీడీపీకి దిక్కులేని సమయంలో తనను బతిమలాడి పార్టీలోకి చేర్చుకున్నారని చెప్పారు. అప్పుడు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు తన గుండెలపై తన్నాడని గంగుల ఆవేదన చెందారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Chandrababu Fires Jagan Corruption Gangula Prabhakar Reddy

Loading comments ...

తెలుగు వార్తలు

news

తమిళనాడులో తెరపైకి కాంపోజిట్ బలపరీక్ష.. డీఎంకే అండ ఉంటే పన్నీర్‌కే పగ్గాలు?

తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడిన రాజకీయ ప్రతిష్టంభనను తొలగించేందుకు గవర్నర్ సీహెచ్ ...

news

శశికి జైలు ముందే తెలుసు.. శివనమలై ఆండవర్ కోయిల్‌లో ఇనుప గొలుసును ఉంచి పూజ..

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ కేసు తీర్పు ముందుగానే తెలిసిపోయింది. శివనమలై ఆండవర్‌ ...

news

కుదిరితే అధికారం.. లేదంటే మధ్యంతరమే.. డీఎంకే ఆచితూచి అడుగులు

తమిళనాడు రాష్ట్రంలోని అధికార అన్నాడీఎంకేలో ఏర్పడిన అంతర్గత సంక్షోభాన్ని తనకు అనుకూలంగా ...

news

పెళ్లైన ప్రియుడిని అక్రమ సంబంధం పెట్టుకోమని బెదిరించింది.. చంపేశాడు..

పెళ్లయ్యాక ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకోమని బెదిరించిన యువతిని ఆమె మాజీ ప్రేమికుడు ...

Widgets Magazine