బుధవారం, 26 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 ఫిబ్రవరి 2025 (17:10 IST)

ఢిల్లీ పర్యటన.. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయిన చంద్రబాబు, పవన్

Pawan Kalyan_Chandra Babu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన సందర్భంగా సమావేశాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. గురువారం ఉదయం వారు కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పటేల్‌తో సమావేశమయ్యారు. 
 
పోలవరం ప్రాజెక్టు కోసం ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో కేటాయించిన రూ.12,000 కోట్ల విడుదలపై వారి చర్చలు జరిగాయి. అదనంగా, 17,500 క్యూసెక్కుల నీటి బదిలీ సామర్థ్యంతో ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాలువలను నిర్మించడానికి అవసరమైన ఆర్థిక సహాయంపై వారు చర్చించారు.
 
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఢిల్లీ వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్.. ఆపై బీజేపీ అగ్రనేత అమిత్ షాతో సమావేశం అయ్యారు. తరువాత, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో చర్చలు జరిపారు. జరుపుతారు. ఈ సమావేశాల తర్వాత, ఆయన తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని, హైదరాబాద్ చేరుకుంటారు.