మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 జనవరి 2020 (15:06 IST)

చంద్రమండలంపైకి మానవసహిత మిషన్? ఇస్రో ఛైర్మన్ ఏమంటున్నారు?

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఛైర్మన్‌గా కె. శివన్ నాయర్ కొనసాగుతున్నారు. ఈయన హయాంలోనే చంద్రయాన్-2 చేపట్టారు. అది ఆఖరి క్షణంలో విఫలమైంది. ఈ క్రమంలో ఇపుడు చంద్రయాన్ - 3 ప్రాజెక్టును చేపట్టారు. ఇదే అంశంపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, 'చంద్రయాన్-3 మిషన్ పనులు ప్రారంభమయ్యాయి. శరవేగంతా సాగుతున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే, చంద్రమండలం మీదికి మానవ సహిత మిషన్‌ చేపట్టే రోజులు కూడా తప్పకుండా వస్తాయి ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 
 
కాగా, చంద్రయాన్-3 నిర్మాణం చంద్రయాన్-2 మాదిరిగానే ఉంటుందన్నారు. కానీ చంద్రయాన్-3లో ల్యాండర్‌తో పాటు ప్రొపల్షన్ మాడ్యూల్‌తో కూడిన రోవర్ ఉంటుంది. దీనికి సంబంధించిన పనులు సజావుగా సాగుతున్నాయి అని వివరించారు. అదేసమయంలో చంద్రయాన్-3 ల్యాండర్ నిర్మాణం కోసం దాదాపు రూ.250 కోట్లు, ప్రయోగానికి రూ.350 కోట్ల వరకు ఖర్చవుతుందని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.