మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 నవంబరు 2024 (15:59 IST)

తల్లికి సరిగ్గా వైద్యం చేయలేదు.. డాక్టర్‌ను కత్తితో ఏడుసార్లు పొడిచాడు..

Doctor
చెన్నైలోని కలైంజ్ఞర్ సెంటినరీ ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ బాలాజీ జగన్నాథన్‌ను పేషెంట్ కుమారుడు కత్తితో దాడి చేశాడు. గతంలో కీమోథెరపీ చేయించుకున్న తన తల్లికి ఆస్పత్రిలో సరైన వైద్యం అందించడం లేదనే కోపంతో డాక్టర్‌పై విఘ్నేష్ అనే వ్యక్తికి దాడికి పాల్పడ్డాడు. వైద్యుడిని కత్తితో ఏడు సార్లు పొడిచి తీవ్రంగా గాయపర్చాడు. చెన్నైలోని కలైంజ్ఞర్ సెంటినరీ ఆసుపత్రిలోని కేన్సర్ వార్డులో ఈ ఘటన జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని కలైంజ్ఞర్ సెంటినరీ ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ బాలాజీ జగన్నాథన్‌ను ఒక రోగి కుమారుడు కత్తితో ఏడుసార్లు పొడిచాడు. డాక్టర్ బాలాజీ జగన్నాథన్ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. చెన్నైకి చెందిన నిందితుడు విఘ్నేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు.