Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మహిళ ముక్కులోకెళ్లిన బొద్దింక... ఏం చేసిందో తెలుసా?

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (15:38 IST)

Widgets Magazine
Cockroach

సాధారణంగా ముక్కులోకి చిన్నపాటి దోమ వెళ్లినా బహు చిరాగ్గా ఉంటుంది. అలాంటిది ఏకంగా బొద్దింక వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. కానీ, చెన్నైకు చెందిన ఓ మహిళ ముక్కులోకి ఓ బొద్దింక దూరింది. అది ముక్కు రంధ్రం గుండా ఏకంగా నేత్రాల వరకు వెళ్లిపోయింది. దీంతో ఆమె నరకయాతన అనుభవించింది. దీన్ని 12 గంటల పాటు పోరాటం చేసి వెలికి తీశారు వైద్యులు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
చెన్నైలోని ఇంజంబాకం ప్రాంతానికి చెందిన సెల్వి (42) అనే మహిళ మంగళవారం రాత్రి నిద్రపోతుండగా, ఉన్నట్టుండి ఆమె ముక్కులో ఏదో దురద పుట్టినట్లనిపించి నిద్రలేచింది. జలుబు వల్ల అలా అయి ఉంటుందనుకుని.. మళ్లీ నిద్రలోకి జారుకుంది. అయితే, ముక్కు తీవ్రంగా ఇబ్బంది పెడుతుండటంతో ఏదో ఉందని భావించింది. వెంటనే ఆమెను వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అక్కడ ముక్కు లోపల ఏదో పెరిగి ఉంటుందనుకున్నారు. అక్కడ నుంచి మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ముక్కులోకి నీటిని పంప్ చేసి బయటకు తీద్దామనుకున్నారు. కానీ, అది సాధ్యపడలేదు. దీంతో మరో ఆస్పత్రికి వెళ్లగా, ఏదో కదులుతున్న వస్తువు ఉందని చెప్పి, స్కాన్ చేయాలన్నారు.
 
బుధవారం తెల్లవారేసరికి ఆమెకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టం కావడంతో స్టాన్లీ మెడికల్ కాలేజి ఆస్పత్రిలోని ఈఎన్‌టీ విభాగానికి ఆమెను తరలించారు. అక్కడి వైద్యులు ముక్కుకు ఎండోస్కొపీ చేసి చూడగా.. రెండు యాంటెన్నాల లాంటివి కనిపించాయి. అది పెద్ద బొద్దింకేనని ఈఎన్‌టీ విభాగాధిపతి డాక్టర్ ఎంఎన్ శంకర్ చెప్పారు. ఎట్టకేలకు వాళ్లు ఒక సక్షన్, ఫోర్‌సెప్స్ ఉపయోగించి ఆ బొద్దింకను బయటకు లాగారు. అలా దాన్ని బయటకు తీసేందుకు 45 నిమిషాల సమయం పట్టింది. ఇంతకూ ఆ బొద్దింక బయటకు తీసేంతవరకు ప్రాణాలతో ఉండటం గమనార్హం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బాహుబలి అవతారంలో హరీష్ రావత్.. ఉత్తరాఖండ్‌ను ఎత్తేశాడు.. మోడీ అవాక్కయ్యారు..

దేశంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. అందులో ఉత్తరాఖండ్ కూడా ఒకటి. ...

news

సీల్డు కవర్.. సీఎం చాంబర్.. సేఫ్ లాకర్... మంత్రిగారి భవితవ్యం భద్రం.. ఎవరాయన?

ఓ సీల్డు కవర్. అందులే ఆ మంత్రివర్యుని భవితవ్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు నిశితంగా పరిశీలించి ...

news

బీటెక్ పట్టభద్రుడి సోషల్ ఫ్రాడ్ ... 'క్లిక్కులు.. లైక్‌'ల పేరుతో రూ.3700 కోట్లు దోచేశాడు.. ఎలా?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ బీటెక్ పట్టభద్రుడు సోషల్ ఫ్రాడ్‌కు పాల్పడ్డాడు. క్లిక్కు, ...

news

అటవీశాఖామంత్రిగా నారా లోకేష్‌..? బొజ్జల పదవి అనుమానమే..!

ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు అనుకున్నదే చేస్తున్నారు. తన కుమారుడిని ఎప్పటి నుంచో ...

Widgets Magazine