Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ్వాసనాళంలో బ్లేడు ముక్కలు ... చిన్నపేగులో ప్లాస్టిక్ పుల్ల... నిజమా?

గురువారం, 29 జూన్ 2017 (15:04 IST)

Widgets Magazine
shaving blade

చెన్నైకు చెందిన ఓ యువకుడికి ప్రభుత్వ స్టాన్లీ ఆస్పత్రి వైద్యులు పునర్జన్మ కల్పించారు. శ్వాసనాళంలో చిక్కుకున్న బ్లేడు ముక్కలతోపాటు చిన్న పేగులో ఉన్న ప్లాస్టిక్ పుల్లను వైద్యులు ఆపరేషన్ చేసి తొలగించారు. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
చెన్నై శివారు ప్రాంతమైన కార్నాడైకు చెందిన కాళిదాస్‌(25) ఓ మతిస్థిమితంలేని యువకుడు. ఇటీవల అతడికి విపరీతమైన కడుపునొప్పి రావడంతో తల్లిద్రండులు అతడిని చెన్నై నగరంలోని ప్రభుత్వ స్టాన్లీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ కాళిదాస్‌కు వైద్యనిపుణులు అల్ట్రాసౌండ్ స్కాన్‌, సీటీ స్కాన్‌ చేశారు. 
 
ఇందులో అతడి చిన్న పేగులో 12 సెంటీమీటర్ల పొడవున్న ప్లాస్టిక్‌ పుల్ల, కుడివైపు శ్వాసనాళంలో రెండు బ్లేడు ముక్కలు ఉన్నట్లు గుర్తించారు. ఆ వెంటనే వైద్య నిపుణుల బృందం అతడికి రెండు రోజులపాటు కృత్రిమశ్వాస అందించి మూడు ఆపరేషన్ల చేసి శ్వాసనాళంలోని బ్లేడు ముక్కలను, చిన్నపేగులోని ప్లాస్టిక్‌ పుల్లను తొలగించారు.
 
కాళిదాస్‌ ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని ఆసుపత్రి డీన్‌ డాక్టర్‌ పొన్నంబళం నమశ్శివాయం తెలిపారు. ఈ ఆపరేషన్‌లకు ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షలాది రూపాయలు ఖర్చయ్యేవని, తాము ముఖ్యమంత్రి ఆరోగ్య భీమా పథకం కింద కాళిదాస్‌కు శస్త్రచికిత్సలు చేశామని ఆయన వివరించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జయలలిత సిరుతాపూర్ బంగ్లాలో అస్థిపంజరం: అది ఎవరిది? దినకరన్‌కు లింకుందా?

తమిళనాడు దివంగత సీఎం జయలలితకు చెందిన సిరుతాపూర్ బంగ్లా వద్ద అస్థిపంజరం బయటపడటం కలకలం ...

news

భర్తకు పక్షవాతం... బావతో పడకసుఖం... మోజు తీరాక తలపై రాయితో కొట్టి...

పక్షవాతంతో మంచానపడిన భర్త వల్ల శారీరకసుఖం లభించలేదని భావించిన ఓ వివాహిత.. వరుసకు బావయ్యే ...

news

నీ నవ్వు సూపర్.. రిపోర్టర్‌‌కు కితాబిచ్చిన డొనాల్డ్ ట్రంప్.. వీడియో చూడండి

ఐర్లాండ్ ప్రధాన మంత్రితో ఫోనులో మాట్లాడుతూ వున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ...

news

ఆన్‌లైన్‌లో పారాచూట్ కొన్నాడు.. స్కైడైవింగ్ కోసం బాల్కనీ నుంచి దూకేశాడు (Video)

స్కైడైవింగ్ నేర్చుకునేందుకుగాను ఓ వ్యక్తి ఇంటి బాల్కలీ నుంచి కిందికి దూకేశాడు.. వద్దు ...

Widgets Magazine