గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2022 (19:40 IST)

కూతురిపై తండ్రి లైంగిక దాడి.. పొట్ట పెరగడంతో..?

rape
తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని తిరువొత్తియూర్‌లో కూతురిని బెదిరించి లైంగికంగా వేధించిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువొత్తియూర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలికకు, అదే పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థినితో పరిచయం ఏర్పడింది. 
 
ఈ విషయం తెలుసుకున్న బాలిక తండ్రి ఆమెను కూతురిగా చూడకుండా బెదిరించి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక పొట్ట పెరగడం చూసి తల్లి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పుడు ఆమెను పరీక్షించిన వైద్యులు బాలిక 8 నెలల గర్భిణి అని తెలిపారు. 
 
బాలికను గట్టిగా ప్రశ్నించగా తన తండ్రి తనను లైంగికంగా వేధించాడనే చేదు నిజాన్ని పోలీసులకు తెలిపింది. దీంతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు కామాంధుడైన తండ్రిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.