1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 మార్చి 2017 (09:40 IST)

ఆర్కే నగర్‌లో దినకరన్ గెలిస్తే.. ఎడప్పాడి పళనిస్వామికి సీఎం పదవికి ఎసరు తప్పదా?

ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థిగా టీటీడీ దినకరన్ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపొందితే సీఎం అవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సీఎం జయలలిత మృతితో ఆర్కే నగర్ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో

ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థిగా టీటీడీ దినకరన్ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపొందితే సీఎం అవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సీఎం జయలలిత మృతితో ఆర్కే నగర్ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో గెలిస్తే దినకరన్‌కు సీఎం పదవి ఖాయమనే ప్రచారంపై రాష్ట్ర మంత్రివర్గంలో సీనియర్‌ మంత్రిగా ఉన్న ఓఎస్‌ మణియన్‌ స్పందించారు. ఈ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ గెలుపొందిన తర్వాత ఈ విషయం గురించి ఆలోచన చేస్తామన్నారు. 
 
కానీ దీనిపై టీటీవీ దినకరన్ స్పందిస్తూ.. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో తాను గెలుపొందినప్పటికీ.. నాలుగేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఎడప్పాడి పళనిస్వామి కొనసాగుతారని చెప్పారు. కానీ, పలువురు సీనియర్‌ తమిళ మంత్రులు మాత్రం ఆర్‌కె నగర్‌లో దినకరన్‌ గెలిస్తే సీఎం బాధ్యతలు చేపట్టడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. దినకరన్ సీఎం కావాలనేదే శశికళ టార్గెట్ అని తెలుస్తోంది.