శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (19:11 IST)

విమానంలో శామ్‌సంగ్ నోట్-2 పేలిపోయింది.. పరుగులు తీసిన ప్రయాణికులు...

విమాన ప్రయాణికులు శామ్‌సంగ్ ఫోన్లతో జాగ్రత్తగా ఉండాలంటూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఇటీవల హెచ్చరికలు చేసింది. ఇవి నిజమని తేలాయి. సింగపూర్ నుంచి చెన్నై వస్తున్న ఇండిగో విమానంలో శుక్రవా

విమాన ప్రయాణికులు శామ్‌సంగ్ ఫోన్లతో జాగ్రత్తగా ఉండాలంటూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఇటీవల హెచ్చరికలు చేసింది. ఇవి నిజమని తేలాయి. సింగపూర్ నుంచి చెన్నై వస్తున్న ఇండిగో విమానంలో శుక్రవారం శామ్‌సంగ్ నోట్-2 మొబైల్‌ పేలి మంటలు పైకెగసాయి. 
 
వాసన రావడంతో గుర్తించిన ప్రయాణికులు విమాన సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే వారు మంటలను అదుపుచేశారు. లేదంటే పెను ప్రమాదమే సంభవించి ఉండేది. శామ్‌సంగ్ నోట్ ఫోన్లతో జాగ్రత్తగా ఉండాలని తాము హెచ్చరిస్తూనే ఉన్నామని, ప్రయాణంలో వారు తమ ఫోన్లను స్విచ్ఛాప్ చేయడం కానీ, లేదంటే అసలు తీసుకురాకపోవడం కానీ మంచిదని డీజీసీఏ అధికార ప్రతినిధి సూచించారు. 
 
సింగపూర్ నుంచి చెన్నై వస్తున్న విమానంలో ఫోన్‌ నుంచి పొగలు, మంటలు వచ్చినట్టు ఇండిగో నిర్ధారించింది. విమానం ల్యాండ్ కావడానికి ముందు 23సీ సీట్ వద్ద ఫోన్ నుంచి పొగలు వచ్చినట్టు సిబ్బంది గుర్తించారని, వెంటనే వాటిని ఆర్పివేశారని పేర్కొంది. ఈ ఘటనపై ఆ విమానంలో ప్రయాణించే ప్రయాణింకులంతా బిత్తర పోయారు.