Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

క్రిస్మస్ ట్రీలు, మొహర్రం రక్తపాతం ఆపే దమ్ముందా : చేతన్ భగత్

మంగళవారం, 10 అక్టోబరు 2017 (16:04 IST)

Widgets Magazine
chetan bhagat

దేశ రాజధాని ఢిల్లీలో నవంబరు ఒకటో తేదీవరకు టపాకాయల విక్రయాలపై సుప్రీంకోర్టు ఇటీవల నిషేధం విధించింది. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఇదే అంశంపై ప్రముఖ రచయిత చేతన్ భగవత్ ట్విట్టర్ వేదికగా కొన్ని ప్రశ్నలు సంధించారు. ఢిల్లీలో టపాసుల అమ్మకాన్ని నిషేధించడాన్ని పలువురు సమర్థిస్తున్నారు. ఇలాంటి వారు తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ఆయన కోరారు. 
 
హిందూ మతానికి చెందిన పండగలపైనేనా మీ ప్రతాపం.. మొహర్రం రోజు జరిగే రక్తపాతాన్ని ఆపే దమ్ముందా అంటూ ప్రశ్నించాడు. పటాకులపై నిషేధం అంటే క్రిస్మస్ సమయంలో క్రిస్మస్ ట్రీలు, బక్రీదు సమయంలో గొర్రెల బలిపై నిషేధించినట్లు ఉందని, ఏదైనా నియంత్రించండి తప్ప నిషేధం వద్దని సూచించాడు. 
 
కొందరు దీనికి మద్దతుగా చేసిన ట్వీట్లకు కూడా చేతన్ సమాధానమిచ్చాడు. మీకు కాలుష్య నియంత్రణపై అంత శ్రద్ధ ఉంటే కార్లు వాడకండి.. ఓ వారం రోజులు ఇంట్లో కరెంటు వాడకండి.. అంతేగానీ ఏడాదిలో ఒక్క రోజు జరిగే దీపావళి పండుగ వల్లే కాలుష్యం పెరిగిపోతుందని ఎలా అంటారు అని నిలదీశాడు. అతని సూటి ప్రశ్నలతో ట్విట్టర్‌లో పటాకుల నిషేధంపై చర్చ మరింత రాజుకుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కంచ ఐలయ్యకు మావోయిస్టు అండ... రక్షణ కోరిన మాజీ ప్రొఫెసర్

"సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు" అంటూ పుస్తకం రాసి విమర్శలపాలైన దళిత రచయిత, మాజీ ప్రొఫెసర్ ...

news

ఫ్లైయింగ్ సాసర్ పేలిపోయింది.. ఏలియన్‌ను స్ట్రెచర్‌పై తీసుకెళ్తున్నారు.. (వీడియో)

గ్రహాంతరవాసులున్నారని.. వారి రూపాలు ఇలా వుంటాయని.. ఫోటోలు విడుదలైన సందర్భాలున్నాయి. అయితే ...

news

చంద్రబాబు ముఖారవిందాన్ని చూసి అవి రావు... జగన్ మోహన్ రెడ్డి

ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఎంతో అవసరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ...

news

కేరళలో తొలి దళిత పూజారి యదు కృష్ణన్...

కేరళ రాష్ట్రంలోని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డ్ చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ...

Widgets Magazine