బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 అక్టోబరు 2023 (12:39 IST)

ఛత్తీస్‌గఢ్‌: బీజేపీ నేతను హతమార్చిన మావోయిస్టులు

Mavoists
ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మావోయిస్టుల ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో బీజేపీ నేతను మావోయిస్టులు హత్యచేశారు. హత్యకు గురైన నేత బీజేపీకి చెందిన బిర్జు తారామ్‌గా గుర్తించారు. 
 
మావోయిస్టులు అతని ఇంట్లోకి వెళ్లి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. రాష్ట్రంలోని రాజనందగావ్ జిల్లా సర్ఖెడా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.