1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 2 జనవరి 2017 (17:04 IST)

గొయ్యిలో పడిపోయిన పిల్ల ఏనుగు.. రాందేవ్ పతంజలిపై కేసు ఎందుకని?

ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్‌లో ఓ గొయ్యిలో పిల్ల ఏనుగు పడిపోయింది. ఆ గొయ్యి నుంచి పైకి వచ్చేందుకు ఏనుగు తంటాలు పడుతోంది. స్థానికులు తమ అవసరాల కోసం ఈ గొయ్యిని తవ్వుకున్నారని సమాచారం. ఆ గొయ్యిలో పిల్ల ఏన

ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్‌లో ఓ గొయ్యిలో పిల్ల ఏనుగు పడిపోయింది. ఆ గొయ్యి నుంచి పైకి వచ్చేందుకు ఏనుగు తంటాలు పడుతోంది. స్థానికులు తమ అవసరాల కోసం ఈ గొయ్యిని తవ్వుకున్నారని సమాచారం. ఆ గొయ్యిలో పిల్ల ఏనుగును గ‌మ‌నించిన స్థానికులు వెంట‌నే అటవీశాఖ అధికారులకు స‌మాచారం అందించారు. ఆ గొయ్యి వ‌ద్ద‌కు చేరుకున్న అధికారులు ఏనుగును అందులో నుంచి బయటకు తీసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 
 
సోమవారం ఉదయం గొయ్యిలో పడిపోయిన పిల్ల ఏనుగు దాని నుంచి బయటికి వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఫోటోలు నెట్లో గంటల్లో పోస్ట్ కావడంతో ఈ వార్తతో పాటు ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. పిల్ల ఏనుగు గొయ్యిలో పడిపోవడంతో పెద్ద ఏనుగు ఆ దరిదాపుల్లో ఉందా అని అటవీశాఖాధికారులు గాలిస్తున్నారు. ఏనుగు పిల్లను బయటికి తీసేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు.  
 
ఇదిలా ఉంటే.. ఇలాంటి ఘటన అస్సాంలో గతంలో చోటుచేసుకుంది. ఇలాంటి గోతిలో పడిపోయిన ఏనుగు మరణించడంతో పతంజలి మెగా హెర్భల్ అండ్ ఫుడ్ పార్కు (అస్సాం)పై ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు. ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతుండటంతో పాటు ఇందుకు యోగా గురువు బాబా రాందేవ్ పతంజలి ఫుడ్ పార్క్ నిర్మాణమే కారణమని పోలీసులు చెప్తున్నారు.