బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 డిశెంబరు 2022 (09:38 IST)

డబ్బు పంపిణీలో వివాదం.. ప్రియుడిని చంపేసిన ప్రియురాలు...

murdercase
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. డబ్బు పంపకంలో ఏర్పడిన వివాదం కారణంగా తన ప్రియుడిని ఓ ప్రియురాలు చంపేసింది. ఆ తర్వాత శవాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో పెట్టి అడవిలోకి తీసుకెళ్లి తగులబెట్టింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాజ్‌నంద్‌గావ్‌కు చెందిన చంద్రభూషణ్ అనే వ్యక్తి కనిపించడం లేదంటూ ఆయన కుటుంబ సభ్యులు మూడు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కోట్నా పానీ అడవుల్లో రెండు రోజుల క్రితం సగం కాలిన మృతదేహాన్ని స్థానికులు గుర్తించినట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. 
 
దీంతో పోలీసుల ఘటనా స్థలానికి వెళ్లి ఆ సగం కాలిన మృతదేహాన్ని చంద్రభూషణ్‌గా వారి కుటుంబ సభ్యుల సహకారంతో గుర్తించారు. ఆ తర్వాత చంద్రభూషణ్ ప్రియురాలు రాగిణి సాహును అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం వెల్లడించింది. 
 
తన వద్ద అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వక పోవడంతో తమ ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని, పలుమార్లు తనను బ్లాక్ మెయిల్ చేస్తూ వేధించడంతో నూతన సాహు అనే స్నేహితుడితో కలిసి హత్య చేసినట్టు వెల్లడించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి రాగిణి సాహును అరెస్టు చేశారు.