గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 4 సెప్టెంబరు 2021 (20:07 IST)

చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వి.రమణ మానవతావాది: సొలిసిట్‌ జనరల్‌

సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వి.రమణ మంచి న్యాయమూర్తి, మంచి మానవతావాది అని  సొలిసిట్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వ్యాఖ్యానించారు.

శనివారం బార్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... సిజెఐ రమణ దేవుడికి భయపడే వ్యక్తి కాదని, దేవుడు ప్రేమించే వ్యక్తి అని అన్నారు.

ఆయన తెలివైన వారు, నిష్పక్షపాతి, అంతేకాక తమ న్యాయవాద కుటుంబంలో అనుకున్న పని పూర్తి చేసే వ్యక్తి అని ప్రశంసలు కురిపించారు.

ఎస్‌ఎ. బాబ్డే పదవీవిరమణ అనంతరం ఈ ఏడాది ఏప్రిల్‌లో చీఫ్‌జస్టిస్‌గా ఎన్‌వి. రమణ నియమితులైన సంగతి తెలిసిందే.

సిజెఐ ఎన్‌వి.రమణ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో 1957, ఆగస్టు 27న జన్మించారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్‌ నుండి రెండవ చీఫ్‌ జస్టిస్‌గా నియమితులయ్యారు.