ఉత్తరప్రదేశ్‌లో పిడుగుపాటు.. ఇద్దరు చిన్నారులతో ఏడుగురు మృతి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పిడుగులు పడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పిడుగుపాటుకు ఇద్దరు చిన్నారులు వున్నారు. బుదౌన్, ఇలాహ్, రాయ్ బరేలీ జిల్లాల్లో పిడుగుపాటు ఘటనలు నమోదయ్యాయి.
గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా పిడుగులు పడ్డాయని అధికారులు తెలిపారు. మరణించిన వారిని బబ్లూ (30), వర్జిత్ యాదవ్ (32), అన్షిత(11), మోహిత్ పాల్ (14), జమున ప్రసాద్ (38), దర్మేంద్ర(32)గా గుర్తించారు.
ఇకపోతే.. రాయ్‌బరేలీలోని దిహ్, భదోఖర్, మిల్ ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు వ్యక్తులు పిడుగుపాటుకు గురై మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పుల పరిహారం ప్రకటించారు.